టీటీడీపీ చీఫ్‌తో కేసీఆర్, 2 లైన్లే రాశారు (పిక్చర్స్)
హైదరాబాద్: మీడియా సంచలనాల కోసం పాకులాడవద్దని, చీకటి కోణాలను వెలికి తీయాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు శనివారం అన్నారు. నవ తెలంగాణ దినపత్రిక ఆవిష్కరణ సభలో కేసీఆర్ మాట్లాడారు. అన్నార్తులకు మీడియా ఆసరాగా ఉండాలన్నారు.
చక్కటి విశ్లేషణలతో రాష్ట్రాన్ని ముందుకు తీసుకు వెళ్లాలని కోరారు. పత్రికలు కొత్త రాష్ట్రమైన తెలంగాణ ఉనికిని కాపాడేందుకు శతవిధాలా ప్రయత్నించాలన్నారు. ఆలపాటి ధర్మారావు సభాపతిగా ఉన్నప్పుడు తాను వ్యవసాయంపై అధ్యయనం చేసి శాసన సభలో 67 నిమిషాలు మాట్లాడితే.. మరుసటి రోజు పత్రికలో రెండు లైన్లు వచ్చిందన్నారు.
పదిమంది ఎమ్మెల్యేలతో కలిసి తన పేరు వచ్చిందని చెప్పారు. సభలో ముఖ్యమంత్రిపై కాగితాలు విసిరేస్తే దానికి ప్రాధాన్యమిస్తారని, సీఎంపై ఎమ్మెల్యే దాడి పేరిట పతాక శీర్షిక ప్రచురిస్తారన్నారు. హైదరాబాదులో 1.50 లక్షల మంది ఫుట్ పాత్‌లపై జీవిస్తున్నారని ఓ సర్వే తెలిపిందని, దీనికి సమాజం సిగ్గుపడాలన్నారు. కాగా, ఈ ఆవిష్కరణలో కేసీఆర్, ఉత్తమ్ కుమార్, ఎల్ రమణలు కరచాలనం చేసుకున్నారు.

నవ తెలంగాణ
తెలంగాణ కోసం వచ్చిన పత్రిక నిలదొక్కుకొని ప్రజల చేతిలో ఆయుధంగా నిలవాలని, విశ్లేషణాత్మక వ్యాసాలతో ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకు రావాలని కేసీఆర్ నవ తెలంగాణ దినపత్రికకు సూచించారు. నవ తెలంగాణ పత్రిక ఆవిష్కరణలో కేసీఆర్, ఎల్ రమణ, ఉత్తమ్ కుమార్ రెడ్డి.

నవ తెలంగాణ
నవ తెలంగాణ దినపత్రిక ఆవిష్కరణ సభలో సీఎం కేసీఆర్, తెలంగాణ టీడీపీ చీఫ్ ఎల్ రమణ, తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తదితరులు.

నవ తెలంగాణ
నవ తెలంగాణ పత్రిక ఆవిష్కణలో... పత్రికను చూస్తున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు దృశ్యం.

నవ తెలంగాణ
మీడియా సంచలనాల కోసం పాకులాడవద్దని, చీకటి కోణాలను వెలికి తీయాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు శనివారం అన్నారు.

నవ తెలంగాణ
చక్కటి విశ్లేషణలతో రాష్ట్రాన్ని ముందుకు తీసుకు వెళ్లాలని కేసీఆర్ కోరారు. పత్రికలు కొత్త రాష్ట్రమైన తెలంగాణ ఉనికిని కాపాడేందుకు శతవిధాలా ప్రయత్నించాలన్నారు.

నవ తెలంగాణ
ఆలపాటి ధర్మారావు సభాపతిగా ఉన్నప్పుడు తాను వ్యవసాయంపై అధ్యయనం చేసి శాసన సభలో 67 నిమిషాలు మాట్లాడితే.. మరుసటి రోజు పత్రికలో రెండు లైన్లు వచ్చిందన్నారు.












Click it and Unblock the Notifications