సెప్టెంబర్ లోనూ వేసవి ఎండ, ఉక్కపోత.. కరెంట్ కోత: ఉక్కిరిబిక్కిరి- అప్పటి వరకు ఇంతే..!!
తెలుగు రాష్ట్రాల్లో భిన్నమైన వాతావరణ పరిస్థితులు ఏర్పడ్డాయి. సెప్టెంబర్ వచ్చినా చినుకు జాడ లేదు. 39 డిగ్రీల ఉష్ణోగ్రత దాటిపోతోంది.తుఫాన్లు వచ్చినా.. అల్పపీడనాలు ఏర్పడినా రాష్ట్రంపై ప్రభావం చూపలేదు. ఇది కూడా ఎల్‌నినో ప్రభావం తో వాతావరణ అంచనాలు మారిపోయాయి. ఇక, విద్యుత్ వినియోగం పీక్ కు చేరింది. అప్రక్రిత కోతలు కొనసాగుతున్నాయి. ఎంత.. ఉక్కపోత.. విద్యుత్ కోతలతో జనం ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు.
వర్షాలు కురవాల్సిన సెప్టెంబర్ లోనూ ఇంకా రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. శని, ఆదివారాల్లో భానుడి ప్రతాపం తీవ్రంగా ఉంది. ప్రకాశం జిల్లా పొన్నలూరులో 39.6, చీమకుర్తిలో 39.1, నెల్లూరు జిల్లా కావలిలో 38.8, గుంటూరు జిల్లా ప్రత్తిపాడు, ప్రకాశం జిల్లా బల్లికురవలో 38, బాపట్ల జిల్లా చీరాలలో 37.9 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గత రెండు రోజుల్లోనూ మధ్యాహ్నం సమయంలో రాష్ట్రవ్యాప్తంగా 473 ప్రాంతాల్లో 30 డిగ్రీల కన్నా అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయం 9గంటల నుంచే ఎండ మండిపోయింది. సాయంత్రం వరకు వేడి వాతావరణం కొనసాగింది. దీనికితోడు ఉక్కపోత నెలకుంది. ఎండ తీవ్రత కొనసాగడానికి ఎల్‌నినో పరిస్థితులే కారణమని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఎల్‌నినో ప్రభావం వల్ల ఈ ఏడాది వేసవి సుదీర్ఘంగా కొనసాగుతోందని వెల్లడించారు.

వచ్చే వేసవి పూర్తయ్యే వరకూ ఇదే పరిస్థితి
కాగా, ఈ ఏడాది జూన్ 1 నుంచి సెప్టెంబరు 5 వరకు రాష్ట్రవ్యాప్తంగా 45.29 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉంది. కానీ, ఇప్పటి వరకు 20.39 సెంటీమీటర్ల వర్షపాతమే నమోదైంది. దీనిని బట్టి రాష్ట్రవ్యాప్తంగా 55.1 శాతం లోటు నెలకొంది. గత మూడు దశాబ్దాల్లో 1997, 2002, 2009, 2015, 2023 సంవత్సరాల్లో ఎల్‌నినో ప్రభావం చూపింది. కానీ, ఈ ఏడాది వచ్చినంత తీవ్రంగా గతంలో లేదని నిపుణులు చెబుతున్నారు. ఇదే సమయంలో రాష్ట్రం లో విద్యుత్ వినియోగం అన్ని రికార్డులనూ దాటేస్తోంది. వేసవిని మించి వినియోగం జరుగుతుండ డంతో విద్యుత్ సంస్థలు డిమాండ్‌కు తగినట్లు కరెంటు సరఫరా చేయలేకపోతున్నాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా అప్రకటిత విద్యుత్ కోతలు అనివార్యమవుతున్నాయి. కేంద్ర గ్రిడ్ నుంచి కొన్ని రోజులుగా గరిష్ఠ స్థాయిలో విద్యుత్‌ను వినియోగించుకుంటున్నారు. శనివారం ఒక్కరోజే 12 మి.యూనిట్ల లోటు నమోదైంది. అయితే, వచ్చే వర్షాకాలం వరకు ఇదే తరహా వాతావరణ పరిస్థితు లు ఉంటాయని అంచనా వేస్తున్నారు.












Click it and Unblock the Notifications
