కేసీఆర్ కు కేంద్రం షాక్-అధికారికంగా విముక్తి దినోత్సవం-కేసీఆర్, షిండే, బొమ్మైకూ ఆహ్వానం

తెలంగాణలో హైదరాబాద్ విలీన దినోత్సవం పేరుతో ఇన్నాళ్లూ బీజేపీ చేస్తున్న హంగామాకు కేంద్రం ఇక అధికారిక గుర్తింపు ఇచ్చేసింది. ఈ మేరకు ఈ నెల 17న నిర్వహించే అధికారిక వేడుకలకు తెలంగాణతో పాటు ఒకప్పుడు హైదరాబాద్ లో భాగమైన కర్నాటక, మహారాష్ట్ర రాష్ట్రాల ముఖ్యమంత్రులకూ ఆహ్వానాలు పంపింది. తద్వారా కేసీఆర్ నిర్వహించని వేడుకల్ని తాము నిర్వహిస్తూ టీఆర్ఎస్ కు భారీ షాక్ ఇవ్వబోతోంది.

 అధికారికంగా హైదరాబాద్ విలీన దినం

అధికారికంగా హైదరాబాద్ విలీన దినం

ఒకప్పుడు హైదరాబాద్ నవాబుల పాలనలో ఉన్న ప్రాంతాన్ని సర్దార్ వల్లభాయ్ పటేల్ సైనిక చర్య ద్వారా భారత యూనియన్ లో విలీనం చేసిన సందర్భాన్ని పురస్కరించుకుని ఏటా సెప్టెంబర్ 17న బీజేపీ విలీన దినం నిర్వహిస్తోంది. అయితే అదే సమయంలో హైదరాబాద్ తో పాటు తెలంగాణలో భారీ సంఖ్యలో ఉన్న ముస్లింల మనోభావాల్ని దృష్టిలో ఉంచుకుని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తో పాటు విభజన తర్వాత తెలంగాణలోనూ ప్రభుత్వాలు ఈ విలీన దినానికి దూరంగా ఉంటుూ వస్తున్నాయి.

ఇప్పుడు కేంద్రం తెలంగాణలో బీజేపీ ఎలాగైనా పాగా వేసేందుకు చేయిస్తున్న ప్రయత్నాల్లో భాగంగా విలీన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని నిర్ణయించింది.

 కేసీఆర్ కు కేంద్రం షాక్

కేసీఆర్ కు కేంద్రం షాక్

హైదరాబాద్ విలీన దినాన్ని అధికారికంగా నిర్వహించాలని కొన్నేళ్లుగా కేంద్రం, బీజేపీ చేస్తున్న డిమాండ్ ను కేసీఆర్ పట్టించుకోవడం లేదు. అయినా బీజేపీ మౌనంగానే ఉంటోంది. కానీ ఈసారి వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికలకు దీన్ని రాజకీయంగా వాడుకోవాలని చూస్తున్న బీజేపీ.. కేంద్రం సాయంతో ఈ విలీన దినోత్సవాన్ని అధికారికంగా గుర్తించడంతో పాటు ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ తరహాలో ఏడాది పాటు వేడుకలు నిర్పహించాలని నిర్ణయించింది.

దీంతో కేసీఆర్ కు భారీ షాక్ ఇవ్వబోతోంది. మరి కేసీఆర్ దీనిపై ఎలా స్పందిస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

 కేసీఆర్ తో పాటు షిండే, బొమ్మైకూ ఆహ్వానం

కేసీఆర్ తో పాటు షిండే, బొమ్మైకూ ఆహ్వానం

సెప్టెంబర్ 17న హైదరాబాద్ లో నిర్వహించే విలీన దినోత్సవ వేడుకలకు రావాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు కర్నాటక, మహారాష్ట్ర ముఖ్యమంత్రులు బసవరాజ్ బొమ్మై, ఏక్ నాథ్ షిండేలకూ కేంద్రం ఆహ్వానం పంపింది. ఈ మేరకు కేంద్ర సాంస్కృతిక వ్యవహారాలశాఖ మంత్రి కిషన్ రెడ్డి ఈ ముగ్గురికి ప్రత్యేకంగా లేఖలు రాశారు.

ఇందులో కేంద్రం.. ఈ ఏడాది స్వాతంత్ర్యం సిద్ధించి 75 ఏళ్లు అవుతున్న సందర్భంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ పేరుతో పలు కార్యక్రమాలు నిర్వహిస్తోందని, ఈ సందర్భంగా కీలకమైన భారత యూనియన్ లో హైదరాబాద్ విలీనమైన దినాన్ని కూడా విముక్తి దినోత్సవంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

ఇప్పటివరకూ ఈ మూడు రాష్ట్రాల్లో ఈ విలీన దినోత్సవాలు విడివిడిగా జరుగుతున్నాయని, కానీ ఈ ఏడాది నుంచి అధికారికంగా కేంద్రం దీన్ని గుర్తిస్తోందని, కాబట్టి హైదరాబాద్ లో నిర్వహించే ఉమ్మడి వేడుకలకు రావాలని ముఖ్యమంత్రుల్ని కిషన్ రెడ్డి కోరారు.

బీజేపీ ప్లాన్ సక్సెస్?

బీజేపీ ప్లాన్ సక్సెస్?

ఇప్పటివరకూ హైదరాబాద్ విముక్తి దినోత్సవం పేరిట ఈ వేడుకల్ని నిర్వహిస్తున్న బీజేపీ.. ఇప్పుడు కేంద్రం సాయంతో దీన్ని అధికారికంగా గుర్తించడంతో పాటు కేసీఆర్ కు ఇష్టం లేని ఈ వేడుకల్ని హైదరాబాద్ లోనే నిర్వహించేందుకు సిద్దం కావడం చర్చనీయాంశమవుతోంది. అంతే కాదు ఇందులో బీజేపీ పాలిత మహారాష్ట్ర, కర్నాటక ముఖ్యమంత్రుల్ని కూడా భాగస్వాముల్ని చేయడం ద్వారా తన పంతం నెగ్గించుకునేందుకు కేంద్రం ప్రయత్నిస్తోంది. తద్వారా తెలంగాణలో ఎన్నికల రాజకీయాన్ని మరింత రగిల్చేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టేసింది.

 కేసీఆర్ హాజరవుతారా?

కేసీఆర్ హాజరవుతారా?

ఇంతవరకూ బాగానే ఉన్నా ఈ విముక్తి దినోత్సవానికి కేసీఆర్ హాజరవుతారా లేదా అన్నది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది. ఇప్పటికే ఢిల్లీ కేంద్రం నిర్వహించే నీతి ఆయోగ్ భేటీలు సహా మరే ఇతర కార్యక్రమాలకు హాజరు కాకుండా దూరం పాటిస్తున్న కేసీఆర్.. ఇప్పుడు హైదరాబాద్ లో ప్రధాని మోడీ సహా బీజేపీ నేతలు, సీఎంలు హాజరయ్యే ఈ కార్యక్రమానికి హాజరవుతారా లేదా అన్న ఉత్కంఠ నెలకొంది. గతంలో ప్రధాని మోడీ హైదరాబాద్ కు వచ్చి పాల్గొన్న కార్యక్రమాలకే కేసీఆర్ అనారోగ్య కారణాలతో డుమ్మా కొట్టారు. మరి ఈసారి కూడా అదే పని చేస్తారా లేక మోడీతో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొంటారా అన్నది చూడాల్సి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+