KTR: కేటీఆర్ కు సుప్రీంకోర్టు బిగ్ షాక్- ఇక అరెస్టు తప్పదా ?
భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారక రామారావుకు సుప్రీంకోర్టు ఇవాళ భారీ షాకిచ్చింది. గత బీఆర్ఎస్ పాలనలో జరిగిన ఫార్మూలా-ఈ కార్ రేసు ఒప్పందం విషయంలో తెలంగాణ ఏసీబీ నమోదు చేసిన కేసును క్వాష్ చేయాలంటూ ఆయన దాఖలు చేసుకున్న పిటిషన్ పై విచారణ జరిపేందుకు నిరాకరించింది. దీంతో కేటీఆర్ న్యాయవాదులు పిటిషన్ ను ఉపసంహరించుకున్నారు.
ఫార్ములా-ఈ కార్ రేసు కేసులో ఆయనతో పాటు మరికొందరు అధికారులపై తెలంగాణ ఏసీబీ, ఈడీ ఉరుముతున్న నేపథ్యంలో ఈ కేసును క్వాష్ చేయాలంటూ హైకోర్టులో కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్ ఇప్పటికే తిరస్కరణకు గురైంది. దీంతో కేటీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అంతకు ముందే తమ వాదన వినకుండా ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని రేవంత్ సర్కార్ కేవియట్ దాఖలు చేసింది. దీంతో ఇవాళ సుప్రీం నిర్ణయంపై టెన్షన్ నెలకొంది.

ఈ నేపథ్యంలో ఇవాళ కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ తో పాటు రేవంత్ రెడ్డి సర్కార్ దాఖలు చేసిన కేవియట్ పైనా సుప్రీంకోర్టులో జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ ప్రసన్న వర్లె ధర్మాసనం విచారణ జరిపింది. ఫార్ములా-ఈ కార్ కేసులో తనపై ఏసీబీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ను క్వాష్ చేయాలని కేటీఆర్ సుప్రీంను కోరారు. తన క్లయింట్ పై రాజకీయ కారణాలతోనే ఏసీబీ కేసు పెట్టిందని పిటిషనర్ ఆరోపించారు. అయితే విపక్ష నేతగా ఉంటే కేసులు ఎదుర్కోవాలి కదా అంటూ వ్యాఖ్యానించింది. గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పులో జోక్యంం చేసుకునేందుకు నిరాకరించింది. దీంతో కేటీఆర్ లాయర్లు క్వాష్ పిటిషన్ వెనక్కి తీసుకున్నారు.
సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో కేటీఆర్ అరెస్టు విషయంలో ఏసీబీ, ఈడీ దూకుడుగా ముందుకెెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతంలోనే కేటీఆర్ ను అరెస్టు చేసినా హైకోర్టులో ఆయనకు ఊరట లబించింది. ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు ఆధారంగా కేటీఆర్ ను అరెస్టు చేసేందుకు రేవంత్ సర్కార్ సిద్దమవుతోంది. మరోవైపు ఈడీ కూడా విచారణ తర్వాత కేటీఆర్ ను అరెస్టు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.












Click it and Unblock the Notifications