Telangana: వెనుకంజలో ఏడుగురు మంత్రులు..!
తెలంగాణలో కాంగ్రెస్ హవా కొనసాగుతోంది. కాంగ్రెస్ మ్యాజిక్ ఫిగర్ దాటి ఆధిక్యంలో కొనసాగుతోంది. కాంగ్రెస్ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బోణి కొట్టింది. అశ్వారావు పేట నుంచి ఆదినారాయణ విజయం సాధించారు. ఇల్లెందు నుంచి కొరం కనకయ్య గెలుపొందారు. బీఆర్ఎస్ కు గ్రేటర్ హైదరాబాద్, కరీంనగర్, మెదక్ లో ఎక్కువ సీట్లు గెలుచుకునే అవకాశం ఉంది.
ఖమ్మం, నల్గొండ, వరంగల్, మహబూబ్ నగర్ జిల్లాలో కాంగ్రెస్ భారీ ఆధిక్యంలో ఉంది. ఇక ఈ ఎన్నికల్లో ఏడుకు మంత్రులు వెనకంజలో ఉన్నార. ఖమ్మంలో తుమ్మల నాగేశ్వర రావు ఆధిక్యంలో ఉండగా పువ్వాడ అజయ్ వెనుకంజలో ఉన్నారు. పాలకుర్తిలో ఎర్రబెల్లి దయాకర్ రావు వెనకంజలో ఉన్నారు. నిర్మల్ లో ఇంద్రకరణ్ రెడ్డి, బాల్కొండలో వేముల ప్రశాంత్ రెడ్డ, ధర్మపురిలో కొప్పుల ఈశ్వర్, మహబూబ్‌నగర్ లో శ్రీనివాస్ గౌడ్, వనపర్తిలో నిరంజన్ రెడ్డి వెనకంజలో ఉన్నారు.













Click it and Unblock the Notifications