విషాదం: ఒకే కుటుంబానికి చెందిన 7గురు అనుమానాస్పద మృతి

Posted By:
Subscribe to Oneindia Telugu
ఒకే కుటుంబానికి చెందిన 7గురు మృతి, వీడియో !

యాదాద్రి: తెలంగాణ రాష్ట్రంలోని యాదాద్రి జిల్లా రాజాపేట మండలం పాముకుంటలో ఘోర విషాదం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు వ్యక్తులు అనుమానాస్పదరీతిలో మరణించారు.

Seven die in a family at Pamukunta

కోళ్లఫారం వద్ద నివాసగృహంలో వారు మరణించారు. మృతిచెందినవారు వృద్ధులు బైండ్ల బాలనర్సయ్య, భారతమ్మ, దంపతులు బాలరాజు, తిరుమల సహా ఇద్దరు కుమారులు, కూతురు.

Seven die in a family at Pamukunta

మృతులంతా సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలం మునిగడపవాసులుగా తెలుస్తోంది. రాత్రి తిన్న చికెన్ ఫుడ్ పాయిజన్ అయి వీరు మృతిచెంది ఉండవచ్చని స్థానికులు అంటున్నారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కూడా ఆత్మహత్యగా అనిపిచడం లేదని అంటున్నారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకలల జీవిత భాగస్వామిని కనుగొనండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Seven members f a family died at Pamukunta in Yadadri district in Telangana state.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి