పోలీస్‌స్టేషన్‌లో మహిళ మృతి: ఇన్‌స్పెక్టర్, ఎస్ఐలతోపాటు 7గురు పోలీసుల సస్పెన్షన్
హైదరాబాద్: నగరంలోని అసిఫ్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో ఓ మహిళ అనుమానాస్పదంగా మృతి చెందిన కేసులో ఏడుగురు పోలీసులు సస్పెండ్ అయ్యారు. మహిళ మృతిపై ఆగ్రహం వ్యక్తం చేసిన పోలీస్ కమిషనర్.. అసిఫ్‌నగర్ ఇన్‌స్పెక్టర్, ఎస్ఐ, ఏఎస్ఐ, హెడ్ కానిస్టేబుల్, మరో ముగ్గురు కానిస్టేబుళ్లను ఆదివారం సస్పెండ్ చేశారు.
విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు సస్పెండ్ చేసినట్లు ఆయన తెలిపారు. సస్పెండైన వారిలో ఇన్‌స్పెక్టర్ కె. శ్రీకాంత్, ఎస్ఐ పి. హృషికేశ్, ఏఎస్ఐ షేక్ చంద్ బాషా, హెడ్ కానిస్టేబుల్ మొహమ్మద్ నాదర్ అలీ, కానిస్టేబుళ్లు ఎస్ ప్రతాప్, మొహమ్మద్ ఖాజా, మొహమ్మద్ మంజూర్ అహ్మద్‌లు ఉన్నారు.
ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. బోజగుట్టకు చెందిన పద్మ అనే మహిళను దొంగతనం కేసులో విచారణ కోసం పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చారు. పోలీస్ స్టేషన్‌లో ఉంచి పోలీసులు తమదైన శైలిలో విచారించినట్లు తెలిసింది.

దీంతో అస్వస్థతకు గురైన పద్మను పోలీసులు హుటాహుటిన ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ పద్మ ఆదివారం ఉదయం మృతి చెందినట్లు ఉస్మానియా ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.
కాగా, పోలీసుల దెబ్బలకు తాళలేకే పద్మ మృతి చెందిందని బంధువులు ఆరోపించారు. ఇది ఇలా ఉండగా, పద్మ బంధువుల ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదని డిసిపి సత్యనారాయణ అన్నారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ పరిస్థితి విషమించడంతోనే పద్మ మృతి చెందిందని డిసిపి తెలిపారు.












Click it and Unblock the Notifications