పదో తరగతి విద్యార్థినిపై రేప్: అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి
హైదరాబాద్: కరీంనగర్ జిల్లా వీణవంక మండలం చల్లూరులో పదో తరగతి చదువున్న బాలికపై అదే గ్రామానికి చెందిన నీలం రమేష్ అనే యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. శనివారం రాత్రి బాలిక ఇంట్లో ఎవరు లేని సమయంలో ఆమె ఇంటిలోకి చొరబడ్డ రమేష్ బాలికపై అఘాయిత్యం చేశాడు.
బాలిక కేకలు వేయడంతో చుట్టు పక్కల వారు అక్కడికి చేరుకున్నారు. పారిపోవడానికి ప్రయత్నించిన రమేష్‌ను పట్టుకుని చితకబాదారు. జరిగిన విషయాన్ని తెలుసుకున్న బాలిక తండ్రి నాగయ్య పోలీసులను ఆశ్రయించాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
అదిలాబాద్ జిల్లా శ్రీరాంపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని అరుణక్కనగర్ ఎదురుగా ఉన్న నర్సరీలో అనుమానాస్పదస్థితిలో ఇదే నగర్‌కు చెందిన అత్తెం లింగయ్య (35)అనే యువకుడు మృతి చెందాడు. ఈనెల 6న లక్ష్మి తన కుమారుడు లింగయ్య ఫిర్యాదు అదృశ్యమయ్యాడని పోలీసులకు ఫిర్యాదు చేయగా మిస్సింగ్ కేసుగా నమోదు చేశారు.
అయితే, లింగయ్య మృతి చెందడంపై తల్లి లక్ష్మి అనుమానం ఉందని ఫిర్యాదు చేసినట్లు అదనపు ఎస్సై మసూద్ తెలిపారు. లింగయ్య భార్య స్వరూపతో తరుచూ గొడవలు జరగడంతో గత కొద్ది రోజులుగా తల్లిగారింట్లో ఉంటోంది. ఇదే క్రమంలో గత రోల 30 తేదీన ఇంట్లో నుంచి వెళ్లిన కుమారుడు శవమై కనిపించడంతో తల్లి రోధించింది. మృతుడికి కూతురు, కుమారుడు ఉన్నారు. సంఘటన స్థలాన్ని మంచిర్యాల ఏఎస్పీ విజయ్‌కుమార్, శ్రీరాంపూర్ సీఐ వేణు చందర్‌లు పరిశీలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై తెలిపాడు.

వివాహిత ఆత్మహత్య
రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం తిమ్మాపూర్‌లో వివాహిత ఆత్మహత్య చేసుకుంది. కుటుంబకలహాలే ఆమె ఆత్మహత్యకు కారణమని పోలీసులు తెలుపుతున్నారు. కేసు నమోదు చేసుకొని విచారణ ప్రారంభించామని వారు తెలిపారు. పోస్టుమార్టుం నిమిత్తమై మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి పోలీసులు తరలించారు.
డ్రైవర్‌పై క్లీనర్ దాడి
మెదక్ జిల్లా తూప్రాన్ బైపాస్‌రోడ్డులో లారీ డ్రైవర్ బాబూలాల్‌పై క్లీనర్ రమేష్ దాడి చేశాడు. ఈ ఘటనలో బాబూలాల్ మృతి చెందగా క్లీనర్ రమేష్ పరారిలో ఉన్నాడు. ముందుగా ఇద్దిరి మధ్య మొదలైన చిన్నగొడవే బాబూలాల్ మృతికి కారణమని అంటున్నారు.
తీవ్రంగా గాయపడ్డ బాబూలాల్‌ను గాంధీ ఆస్పత్రిలో అత్యవసర చికిత్స కోసం చేర్పించగా చికిత్స పొందుతూ బాబూలాల్ మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు క్లీనర్ రమేష్ కోసం గాలిస్తున్నారు.
-
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్‌పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!!












Click it and Unblock the Notifications