Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

తలసానిపై 420 కేసు: షబ్బీర్ అలీ, రిజైన్.. గవర్నర్‌నూ ఏకేశారు

హైదరాబాద్: ప్రజలను చీట్ చేసిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పైన 420 కేసు పెట్టాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత షబ్బీర్ అలీ ఆదివారం అన్నారు. తలసాని అసెంబ్లీకి వచ్చింది ప్రజా సేవగా లేక ప్రజలను చీట్ చేయడానికా అని ప్రశ్నించారు. ప్రజలను ఆయన తప్పుదోవ పట్టించారన్నారు.

ఇతర పార్టీ ఎమ్మెల్యేచే మంత్రిగా ఎలా ప్రమాణం చేయిస్తారో చెప్పాలన్నారు. పార్టీ ఫిరాయింపులపై సభలో నిలదీస్తామన్నారు. తలసాని పైన ఫిర్యాదు చేసినా గవర్నర్ స్పందించలేదన్నారు. మోడల్ తెలంగాణ పేరుతో పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని ధ్వజమెత్తారు.

తలసాని రాజీనామా అంశాన్ని పార్లమెంట్‌ సమావేశాల్లో లేవనెత్తుతామని వెల్లడించారు. సీఎం కేసీఆర్‌కు నీతి ఉంటే, సిద్ధాంతపరుడైతే తక్షణమే తలసానిని మంత్రి పదవి నుంచి తొలగించాలని డిమాండ్‌ చేశారు. కేసీఆర్‌ను తలసాని తప్పుదోవ పట్టించారా? ఏక కేసీఆరే తలసానికి తప్పుడు సలహా ఇచ్చారా? చెప్పాలన్నారు.

Shabbir Ali demands 420 case on Talasani

గవర్నర్‌ నరసింహన్‌ చట్టాన్ని కాపాడే వ్యక్తి, గత ఏడు నెలలుగా అన్ని రాజకీయ పార్టీల నుంచి ఫిర్యాదు చేస్తున్నామని అయినా గవర్నర్‌ పట్టించుకోవడం లేదన్నారు. ఒక దానిపై ఫిర్యాదు వచ్చినప్పుడు గవర్నర్‌గా ఆయన బాధ్యత ఆయన నిర్వహించడం లేదని మండిపడ్డారు.

తలసాని మంత్రి పదవిలో కొనసాగడంపై ఆయన విజ్ఞతకే వదిలివేస్తున్నామన్నారు. ఫిర్యాదు వచ్చినప్పుడు ఒక గవర్నర్‌గా విచారణ జరపాల్సిన బాధ్యత లేదా అన్నారు.

గవర్నర్‌కు నీతి, నిజాయితీ ఉంటే ఒక్క నిముషం కూడా ఆ పదవిలో కొనసాగే హక్కులేదని, వెంటనే రాజీనామా చేయాలని, లేదా ఎవరేమి అనుకుంటే నాకేంటి అని అనుకుంటే అది మీ విజ్ఞతకే వదిలివేస్తున్నామన్నారు. చట్టాన్ని గవర్నర్‌ రాజ్యాంగాన్ని అవమానపరిచారన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+