వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆకుల లలిత సహా టీఆర్ఎస్‌లోకి నలుగురు ఎమ్మెల్సీలు, హైకోర్టుకు కాంగ్రెస్

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ శాసన మండలిలో కాంగ్రెస్ పక్షాన్ని అధికార తెరాసలో విలీనం చేయడాన్ని తప్పుబడుతు ఆ పార్టీ సోమవారం హైకోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత షబ్బీర్ అలీ ఉమ్మడి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

కాంగ్రెస్‌ ఎమ్మెల్సీలుగా ఉన్న ఆకుల లలిత, సంతోష్ కుమార్‌, ప్రభాకర్‌ రావు, కె దామోదర్ రెడ్డి తెరాసలో చేరారు. మెజార్టీ సభ్యుల కోరిక మేరకు కాంగ్రెస్‌ పక్షాన్ని అధికార టీఆర్ఎస్‌లో విలీనం చేయాలని వారు మండలి ఛైర్మన్ స్వామి గౌడ్‌కు వినతిపత్రం ఇచ్చారు.

ఒత్తిళ్లకు లొంగవద్దని, బాబు భరోసా ఇచ్చారు: జంపింగ్‌పై టీ-టీడీపీ ఎమ్మెల్యే, కేసీఆర్ ప్లాన్ఒత్తిళ్లకు లొంగవద్దని, బాబు భరోసా ఇచ్చారు: జంపింగ్‌పై టీ-టీడీపీ ఎమ్మెల్యే, కేసీఆర్ ప్లాన్

Shabbir Ali petition in high court over defected MLCs

దీంతో మండలిలో కాంగ్రెస్‌ పక్షాన్ని అధికార పార్టీలో విలీనం చేస్తున్నట్టు ఈ నెల 21న అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులు ఆదేశాలు జారీ చేశారు. దీనిని సవాల్‌ చేస్తూ హైకోర్టులో ప్రధాన న్యాయమూర్తి బెంచ్‌లో షబ్బీర్‌ అలీ పిటిషన్ వేశారు.

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ కార్యదర్శి, కౌన్సిల్‌ ఛైర్మన్‌, కేంద్ర ఎన్నికల కమిషన్‌, టీఆర్ఎస్ పార్టీలో చేరిన నలుగురు ఎమ్మెల్సీలను ప్రతివాదులుగా చేస్తూ ఈ పిటిషన్ వేశారు.హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి రాధాకృష్ణన్ సోమవారం సెలవులో ఉండడంతో దీనిని 26వ విచారణకు వచ్చే అవకాశముంది.

English summary
Congress Party senior leader Shabbir Ali petition in high court over defected MLCs in to Telangana Rastra Samithi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X