అలా చేస్తే ఎన్నికల నుంచి తప్పుకుంటాం: కెసిఆర్‌కు షబ్బీర్ అలీ హెచ్చరిక
నిజామాబాద్/హైదరాబాద్: క్యాంపు రాజకీయాలు చేస్తే ఎమ్మెల్సీ ఎన్నికల నుంచి తప్పుకుంటామని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత షబ్బీర్ అలీ అధికార పార్టీని బుధవారం హెచ్చరించారు. రాష్ట్రంలో తీవ్రమైన కరువు ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిపక్షాల ఆందోళనతో ప్రభుత్వం దిగి వచ్చిందని చెప్పారు.
తక్షణమే రూ.5 కోట్ల నష్టపరిహారం చెల్లించాలన్నారు. ప్రభుత్వం కరవు పైన కేంద్రానికి సరైన నివేదిక ఇవ్వలేదని ఆరోపించారు.
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అసలైన తెలంగాణవాదులకు అన్యాయం జరిగిందన్నారు. పక్క పార్టీ నుంచి వచ్చిన వారికే పదవులు ఇస్తున్నారని మండిపడ్డారు. క్యాంప్ రాజకీయాలు చేస్తే తాము ఎన్నికల బరి నుంచి తప్పుకుంటామని చెప్పారు.

ఓయూలో బీఫ్ ఫెస్టివెల్‌కు అనుమతి లేదు: డిజిపి
ఉస్మానియా విశ్వవిద్యాలయంలో బీఫ్ ఫెస్టివెల్‌కు అనుమతి లేదని డిజిపి అనురాగ్ శర్మ బుధవారం నాడు చెప్పారు. మావోయిస్టుల పైన తమ విధానం మారలేదని స్పష్టం చేశారు. అసాంఘిక కార్యకలాపాలను ఉపేక్షించమని, కఠినంగా ఉంటామని చెప్పారు.
డిఎస్పీ ప్రమోషనల్ అక్రమాల పైన విచారణ జరుపుతామని చెప్పారు. పోలీసు నియామకాల్లో సంస్కరణలు తెస్తున్నామన్నారు. 5కె రన్ రద్దు చేస్తున్నామన్నారు.












Click it and Unblock the Notifications