అడ్డుకున్నారు, షర్మిల కాన్వాయ్ అదుర్స్ (పిక్చర్స్)
నల్గొండ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల పరామర్శ యాత్ర నల్గొండ జిల్లాలో కొనసాగుతోంది. జిల్లాలో ఆమె పలు కుటుంబాలను పరామర్శించారు.
ఈ సందర్భంగా మాట్లాడారు. ప్రస్తుత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పాలనలో సంక్షేమ పథకాలు పేద ప్రజలకు అందని ద్రాక్షలా మారాయన్నారు. వైయస్ పాలనలో రాష్ట్ర ప్రజలు ఎంతో ఆనందంగా జీవించారని చెప్పారు.
మళ్లీ అలాంటి పాలన కోసం పేద ప్రజలు ఎదురు చూస్తున్నారన్నారు. ఈ సందర్భంగా ఆమె కుటుంబాలకు లక్ష రూపాయల చెక్కును అందజేశారు. కాగా, నల్గొండ జిల్లా హిల్‌కాలనీలో షర్మిల యాత్రను తెరాస కార్యకర్తలు అడ్డుకున్నారు.

షర్మిల
రాజన్న రాజ్యం వస్తేనే ప్రజల కష్టాలన్నీ తీరతాయని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల అన్నారు.

షర్మిల
బుధవారం నల్లగొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గంలోని చింతపల్లి, చందంపేట మండలాల్లో ఆమె పర్యటించారు. చింతపల్లి మండలం మదనాపురంలోఆడెపు బాలమ్మ కుటుంబాన్ని ఓదార్చి, బాలమ్మ భర్త అబ్బాసలీకి లక్ష రూపాయల చెక్కును అందజేశారు.

షర్మిల
అనంతరం చందంపేట మండలం దేవరచర్లలో కేతావత్ హన్మానాయక్ కుటుంబ సభ్యులను, గువ్వలగుట్టలో రామావత్ భీమ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు.

షర్మిల
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల పరామర్శ యాత్ర నల్గొండ జిల్లాలో కొనసాగుతోంది. జిల్లాలో ఆమె పలు కుటుంబాలను పరామర్శించారు.

షర్మిల
ఈ సందర్భంగా మాట్లాడారు. ప్రస్తుత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పాలనలో సంక్షేమ పథకాలు పేద ప్రజలకు అందని ద్రాక్షలా మారాయన్నారు. వైయస్ పాలనలో రాష్ట్ర ప్రజలు ఎంతో ఆనందంగా జీవించారని చెప్పారు.

షర్మిల
మళ్లీ అలాంటి పాలన కోసం పేద ప్రజలు ఎదురు చూస్తున్నారన్నారు. ఈ సందర్భంగా ఆమె కుటుంబాలకు లక్ష రూపాయల చెక్కును అందజేశారు.

షర్మిల
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల తెలంగాణలో పర్యటిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం ఆమె పాలమూరు జిల్లాలో పర్యటించి, తన తండ్రి మృతిని తట్టుకోలేక చనిపోయిన వారి కుటుంబాలను పరామర్శించారు. ఇప్పుడు ఆమె నల్గొండలో పర్యటిస్తున్నారు.

షర్మిల
షర్మిల నల్గొండ జిల్లాలోని దేవరకొండ నియోజకవర్గం చందపేట మండలం పరిధిలోని దేవచర్ల తండాలో హనుమానాయక్ కుటుంబాన్ని పరామర్శించారు.

షర్మిల
వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అంతకుముందు దేవరకొండ నియోజకవర్గం చింతపల్లి మండలం మదనాపురంలో బాలమ్మ కుటుంబ సభ్యులను పరామర్శించారు.

షర్మిల
షర్మిలను చూసేందుకు పెద్ద ఎత్తున అభిమానులు, కార్యకర్తలు తరలి వచ్చారు. పలు సందర్భాల్లో వైయస్ షర్మిల మాట్లాడారు.

షర్మిల
తెలుగు జాతి ఉన్నంత వరకు దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి తెలుగు ప్రజల మనసుల్లో జీవించి ఉంటారన్నారు. పేదల ప్రజల కోసం వైయస్ ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారన్నారు.












Click it and Unblock the Notifications