వృద్ధుడి పైత్యం: మెట్రోలో అమ్మాయిల ఫొటోలు తీసి! షీటీమ్స్‌కి చిక్కాడు

Subscribe to Oneindia Telugu

హైదరాబాద్‌: ఓ 65ఏళ్ల వృద్ధుడు మెట్రో రైలులో ప్రయాణిస్తూ వికృత చేష్టలకు పాల్పడ్డాడు. తనకు ఎదురుగా ఉన్న అమ్మాయిల ఫొటోలను వారికి తెలియకుండా తీశాడు. దీంతో అక్కడే ఉన్న షీటీమ్స్ అతడ్ని అరెస్ట్ చేసింది.

ఆ వివరాల్లోకి వెళితే.. నర్సింహ(నర్సయ్య)(65) అనే వృద్ధుడు మెట్రోలో ప్రయాణిస్తూ.. తను ఎదురుగా ఉన్న అమ్మాయిల ఫోటోలను తన ఫొట్లో తీశాడు. దీంతో అక్కడే ఉన్న షీ టీమ్స్‌ అతడ్ని పట్టుకుని జైలుకు తరలించాయి.

SHE team arrests 65-year-old man for taking photos of women at metro station

కాగా, సదరు వ్యక్తి విద్యాశాఖలో రిటైర్డ్‌ ఉద్యోగి కావడం గమనార్హం. ఉప్పల్‌ నుంచి నాగోల్‌ వెళ్తున్న మెట్రోరైలులో తనకు ఎదురుగా కూర్చున్న మహిళల ఫోటోలను దొంగచాటుగా తీస్తూ దొరికిపోయాడని షీటీమ్స్ తెలిపాయి.

అంతేగాక, అతని ఫోన్‌ తనిఖీ చేయగా అప్పటికే ఆఫోన్‌లో చాలా మంది మహిళలు, యువతుల ఫోటోలు బయటపడ్డాయని తెలిపాయి. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
SHE team of Rachakonda police arrested a 65-year-old man for taking photos of women at Hyderabad Metro Station.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి