లేడీ టెక్కీలకూ తప్పడం లేదు, షీ టీమ్‌లు: సివి ఆనంద్
హైదరాబాద్: రాజధానిలో ఇకపై మహిళల నుంచి నేరుగా ఫిర్యాదులు స్వీకరిస్తామని సైబరాబాద్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. కమిషనరేట్‌లో మంగళవారం షీ టీమ్ ఫేస్‌బుక్ పేజీని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సైబరాబాద్ పరిధిలో 60 షీటీమ్స్ ఏర్పాటు చేశామని, ప్రతి స్టేషన్‌లోనూ ఉమెన్ హెల్స్ డెస్క్‌ను ఏర్పాటు చేస్తామని చెప్పారు.
షీ టీమ్‌లు ఐటీ కారిడార్‌లో నిరంతరం పర్యవేక్షిస్తాయన్నారు. నగరంలోని అన్ని ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. ట్రాన్స్‌పోర్టు వాహనానికి పోలీసులక అనుమతి తప్పనిసరి అని కమిషనర్ తెలిపారు. ర్యాగింగ్ విషయంలో 100కు డయల్ చేసి ఫిర్యాదు చేయాలని ఆయన సూచించారు. మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లకు కూడా ర్యాగింగ్ బెడద తప్పడం లేదని ఆయన అన్నారు.

ఐటి కారిడార్ పరిధిలో పది షీ బృందాలను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. మహిళలు వేధింపులకు గురయ్యే 200 ప్రాంతాలను గుర్తించినట్లు తెలిపారు. బ్యాంకులు, ఎటిఎంల వద్ద రక్షణ చర్యలు చేపట్టాలని ఆయన అభిప్రాయపడ్డారు. రక్షణ చర్యలు చేపట్టనివాటిని మూయించే అధికారం తమకు ఉందని హెచ్చరించారు. ఇప్పటికే షీ బృందాలు ఆకతాయిలను అదుపులోకి తీసుకుని కౌన్నెలింగ్ ఇస్తున్నట్లు ఆనంద్ తెలిపారు.












Click it and Unblock the Notifications