ఆర్టీసీ బస్సులతో లక్షలు సంపాదిస్తున్న మహిళలు.. తగ్గేదేలే!

తెలంగాణ రాష్ట్రంలో మహిళల ఆర్థిక భరోసా కల్పించడం కోసం ప్రభుత్వం అనేక సంచలన నిర్ణయాలు తీసుకుంటూ ఎప్పటికప్పుడు వారికి అండగా నిలుస్తోంది. ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా స్వయం సహాయక సంఘాల మహిళలకు ఉపాధిని చూపించడంతో పాటు, ఏ రంగంలో అవకాశముంటే ఆ రంగంలో మహిళలు దూసుకు పోయేలా నిర్ణయాలు తీసుకుంటుంది. ఈ క్రమంలోనే తెలంగాణ సర్కార్ తీసుకున్న ఒక నిర్ణయం, మహిళలను లక్షాధికారులను చేస్తోంది.

మహిళా సమాఖ్యల ద్వారా ఆర్టీసీకి అద్దెకు ఇప్పించే వినూత్నకార్యక్రమం
మహిళలకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించడంతోపాటు వారిని ఆర్థికంగా బలోపేతం చేయడానికి లక్ష్యంగా పెట్టుకున్న తెలంగాణ ప్రభుత్వం వడ్డీలేని రుణాలతో మహిళా సమాఖ్యల ద్వారా బస్సులను కొనుగోలు చేయించి, వాటిని ఆర్టీసీకి అద్దెకు ఇప్పించే వినూత్న కార్యక్రమాన్ని చేపట్టిన విషయం తెలిసిందే.

SHG Women earning lakhs from RTC with hire buses in telangana

Take a Poll

బస్సుల అద్దెల డబ్బులు జమ చేయడంతో మహిళల ఆర్ధిక ప్రగతి
మహిళా సమాఖ్యల ద్వారా అద్దె బస్సులను కొనుగోలు చేయడం, వాటిని ఆర్టీసీకి హైర్ చేసి నడిపించడం, తద్వారా వచ్చిన డబ్బులను మండల మహిళా సమాఖ్యల ఖాతాలలో జమ చేయడం వంటి చర్యలతో మహిళల ఆర్థిక ఉన్నతికి ప్రభుత్వం కృషి చేస్తుంది. మండల సమాఖ్యల ఖాతాలలో బస్సుల అద్దెల డబ్బులు జమ చేయడం ద్వారా ఈ మండల సమాఖ్యలు ఆర్థికంగా బలోపేతం అవుతున్నాయి.

మహబూబాబాద్ జిల్లాలో 9 బస్సులు ఆర్టీసీకి అద్దెకు
ఉదాహరణకు మహబూబాబాద్ జిల్లా విషయానికి వస్తే జిల్లాలో తొమ్మిది మండల సమాఖ్యలు బస్సులను కొనుగోలు చేసి 9 ఆర్టీసీ బస్సులను అద్దెకు ఇచ్చాయి. మహబూబాబాద్ డిపోకు ఆరు బస్సులు, తొర్రూరు, నర్సంపేట, భూపాలపల్లి ఆర్టీసీ డిపోలకు ఒక్కొక్క బస్సు వీరు అద్దెకు ఇచ్చారు. 36 లక్షల రూపాయలతో కొనుగోలు చేసి గ్రామీణ అభివృద్ధి సంస్థ ద్వారా సెర్ప్ అధికారులు ఆర్టీసీ అధికారులతో ఒప్పందం కుదుర్చుకొని వారికి అప్పగించారు.

లక్షల ఆదాయం సంపాదిస్తున్న మహిళా సమాఖ్యలు
ఈ అద్దె బస్సుల ద్వారా మండల మహిళా సమాఖ్యలకు ఆదాయం సమకూరుతుంది. ప్రతి బస్సుకు ఆర్టీసీ నెలకు 69 వేల నాలుగు వందల రూపాయలు చొప్పున చెల్లిస్తోంది. బస్సుల ద్వారా వచ్చే ఈ ఆదాయాన్ని సంఘ సభ్యులు తమ అవసరాల కోసం వినియోగించుకునే వెసులుబాటు కూడా కల్పించింది. ప్రస్తుతం వీరి 9 బస్సుల ద్వారా నెలకు ఆరు లక్షల 24 వేల 600 రూపాయల ఆదాయం వస్తుంది.

7 మండల సమాఖ్యల ద్వారా బస్సుల కొనుగోలు ప్రతిపాదనలు
ఈ విధంగా సంవత్సరానికి వీరికి 75 లక్షల రూపాయల ఆదాయం మహిళా సమాఖ్యల ఖాతాలలో జమ కానుంది. ఇప్పటికే గత ఎనిమిది నెలలుగా దాదాపు 50 లక్షల రూపాయల వరకు జమయ్యాయి. తాజాగా మరో 7 మండల సమాఖ్యల ద్వారా బస్సులను కొనుగోలు చేయడానికి ప్రతిపాదనలు పంపించారు. ఈ ప్రతిపాదనలు ఆమోదం పొందితే మరిన్ని మహిళా సమాఖ్యలకు ఆదాయం లభించే అవకాశం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+