రైతులకు షాక్... పీఎం కిసాన్ వారికి లేనట్టే.. ఎందుకంటే!
దేశవ్యాప్తంగా రైతాంగాన్ని ఆదుకోవడానికి రైతులకు వ్యవసాయానికి కావలసిన సాయం అందించడానికి పిఎం కిసాన్ యోజన పథకం అందుబాటులో ఉంది. దేశవ్యాప్తంగా కోట్ల మంది రైతులు పీఎం కిసాన్ పథకం ద్వారా ప్రతి సంవత్సరం 6000 రూపాయల పెట్టుబడి సాయం పొందుతున్నారు. మొత్తం మూడు విడతలుగా ఒక్కో విడతకు 2000 చొప్పున అందించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకొని ప్రతి సంవత్సరం ఈ సహాయాన్ని అందిస్తోంది.
పీఎం కిసాన్ నుండి వారి పేర్లు తొలగింపు
ఇక ముఖ్యంగా దాదాపు 3,000 మంది రైతులు 19వ విడత పిఎం కిసాన్ నగదు పొందలేకపోయారని తెలుస్తుంది. లబ్ధిదారుల జాబితా నుంచి వారి పేర్లను తొలగించినట్టుగా సమాచారం. కొందరు రైతులు అర్హత లేకపోవడం, ఈ కేవైసీ పూర్తి చేయకపోవడం, ఆధార్ లింకింగ్ లో ఉన్న సమస్యలు, తప్పుడు సమాచారం అందించడం వంటి ఇబ్బందులతో పిఎం కిసాన్ డబ్బులను పొందలేకపోయారని అధికారులు చెబున్నారు.

ఏపీ, తెలంగాణాలలో సమస్య
ముఖ్యంగా ఈ సమస్య తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల్లోని కొన్ని జిల్లాలలో ఎక్కువగా ఉందని వారు చెబుతున్నారు. గత ఆర్థిక సంవత్సరంలో ఆదాయపన్ను చెల్లించిన రైతులు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగులు, పదివేల రూపాయల కంటే ఎక్కువ పింఛన్ పొందే పింఛన్ దారులు, వ్యవసాయ భూమి సంస్థల పేరుతో ఉన్నవారు ప్రజా ప్రతినిధులు ఈ అనర్హుల జాబితాలో ఉన్నారు.
ఆధార్ లింక్ లేకపోవటం, సాంకేతిక సమస్యలు
తెలంగాణ రాష్ట్రంలోనూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కొన్ని జిల్లాలలో రైతులు తమ బ్యాంకు ఖాతాలను ఆధార్ తో లింక్ చేయకపోవడం, తప్పుడు ఖాతాల వివరాలు ఇవ్వడం వంటి సాంకేతిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ఇక ఏపీలో కూడా ఇటువంటి సమస్యలతోనే రైతులు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలోనే వీరు పీఎం కిసాన్ డబ్బులను పొందలేకపోయారు.
రైతులు ఇలా చెయ్యండి
ఈ సమస్యలను పరిష్కరించుకోవడానికి రైతులు pmkisan.gov.in వెబ్ సైట్ లో తమ స్థితిని తనిఖీ చేసుకొని ఈ కేవైసీ పూర్తి చేసుకోవాలని సూచిస్తున్నారు. సమీపంలో మీ సేవ కేంద్రాలు, వ్యవసాయ శాఖ కార్యాలయాలను సంప్రదించడం ద్వారా సమస్యలను పరిష్కరించుకోవచ్చు అని వారు సలహా ఇస్తున్నారు. సాంకేతిక సమస్యలతో పీఎం కిసాన్ రానివాళ్లను మినహాయించి, పైన పేర్కొన్న అనర్హుల జాబితాలోని వారికి పీఎం కిసాన్ రానట్టే.












Click it and Unblock the Notifications