ఎమ్మెల్సీ కవితకు షాక్.. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కవితకు ఈడీ నోటీసులు
ఢిల్లీ లిక్కర్ కుంభకోణం వ్యవహారం ఎమ్మెల్సీ కవితకు తలనొప్పిగా తయారైంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కల్వకుంట్ల కవిత ప్రమేయం ఉందని ఢిల్లీకి చెందిన బీజేపీ నేతలు ఆరోపించిన నేపథ్యంలో మొదలైన దుమారం నేటికీ కొనసాగుతోంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఢిల్లీ లిక్కర్ కుంభకోణం వ్యవహారంలో ఈడీ దాడులు కొనసాగిస్తున్న తీరు కూడా ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న అనుమానాలకు కారణంగా మారింది. ఇక తాజాగా ఢిల్లీ లిక్కర్ స్కాంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది.

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఎమ్మెల్సీ కవితకు నోటీసులు
ఢిల్లీ లిక్కర్ కుంభకోణం వ్యవహారం తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు షాకిచ్చింది ఈడీ. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో టిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఈడి నోటీసులు అందజేసింది. ప్రస్తుతం కరోనా సోకడంతో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత క్వారంటైన్ లో ఉన్నారు. ఈ కారణంగా కవిత సహాయకులకు ఈడీ నోటీసులు అందజేసింది. ఇదిలా ఉంటే ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో సోదాలు నిర్వహిస్తున్న ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ గతంలో కవిత పీఏగా పనిచేసిన వ్యక్తి అభిషేక్ రావు ఇంట్లో సోదాలు నిర్వహించింది. నేడు కవిత అకౌంటెంట్ గా పనిచేసిన వ్యక్తి గోరంట్ల బుచ్చిబాబు ఇంట్లో సోదాలు నిర్వహిస్తోంది.

కవిత పర్సనల్ ఆడిటర్ ఇంట్లో ఈడీ తనిఖీలు
హైదరాబాద్ కేంద్రంగా ఈడీ అధికారులు నిర్వహిస్తున్న సోదాల్లో పలువురు వ్యాపారవేత్తలు, చార్టెడ్ అకౌంటెంట్ లు ఉన్నారు. ముఖ్యంగా ఎమ్మెల్సీ కవిత పర్సనల్ ఆడిటర్ గా పనిచేసిన గోరంట్ల బుచ్చి బాబు నివాసంలో ఈడీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. హైదరాబాదులోని దోమలగూడలో అరవింద నగర్ శ్రీ సాయి క్రిష్ణ రెసిడెన్సిలో ఆయన నివాసం ఉంటున్నారు. ఇక ఇదే సమయంలో గచ్చిబౌలిలో అభినవ్ రెడ్డి నివాసంలో కూడా ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. ఇక ఇప్పటికే ఎమ్మెల్సీ కవిత పీఏగా పని చేస్తున్న అభిషేక్ రావు ఇంట్లో కూడా ఈడీ సోదాలు నిర్వహించడం తెలిసిందే.

హైదరాబాద్ లో మళ్ళీ ఈడీ సోదాలు.. 25 చోట్ల కొనసాగుతున్న తనిఖీలు
ఇదిలా ఉంటే తాజాగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించి హైదరాబాదు లింకులపై తమ వద్ద పూర్తి ఆధారాలు ఉన్నాయని వాటిని కోర్టుకు అందజేస్తామని ఢిల్లీకి చెందిన బీజేపీ నేతలు వెల్లడించిన విషయం విదితమే. ఇదిలా ఉంటే తాజాగా ఢిల్లీ లిక్కర్ కుంభకోణానికి సంబంధించి హైదరాబాద్లో ఇరవై ఐదు చోట్ల ఈడి అధికారులు మరోసారి తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ఇప్పటికే ఈడీ హైదరాబాద్లో రెండు సార్లు తనిఖీలు చేపట్టగా, తాజాగా మరోమారు రాబిన్ డిస్టిలరీ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు నిర్వహిస్తున్న రామచంద్ర పిళ్ళై నివాసంతో పాటు, ఆయా కంపెనీలకు డైరెక్టర్లుగా వ్యవహరిస్తున్న అభిషేక్ రావు, ప్రేమసాగర్ రావు ఇళ్లలో తనిఖీలు నిర్వహిస్తున్నారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications