రేవంత్ సర్కార్ కు షాక్.. గురుకుల విద్యాలయాలకు తాళాలు.. ఎందుకంటే
తెలంగాణా రాష్ట్రంలో ప్రభుత్వం విద్యా రంగానికి పెద్ద పీట వేసి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ను ఏర్పాటు చేస్తున్నామని చెప్తున్న సమయంలో ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న గురుకుల స్కూల్స్ కు తాళాలు పడటం ఇప్పుడు రాష్ట్రంలో చర్చకు కారణమైంది. రాష్ట్ర వ్యాప్తంగా అద్దె భవనాలలో నడుస్తున్న గురుకుల స్కూల్స్ కు సంబంధించి అద్దెలు చెల్లించకపోవటంతో భవన యజమానులు గురుకుల స్కూల్స్ కు తాళాలు వేశారు.
గురుకుల విద్యాలయాలకు తాళాలు
తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వ గురుకుల విద్యాలయ ప్రైవేట్ భవన యాజమాన్య సంఘం నేడు తమ నిరసన తెలియజేస్తూ అద్దె భవనాలకు తాళాలు వేశారు. గత తొమ్మిది నెలలుగా ప్రభుత్వం అద్దె చెల్లించకపోవటాన్ని నిరసిస్తూ భవన యజమానులు గురుకుల స్కూల్స్ భవనాలకు తాళాలు వేశారు. తద్వారా తమ నిరసన తెలియజేశారు. దీంతో దసరా సెలవులకు వెళ్లి వచ్చిన విద్యార్థులు, ఉపాధ్యాయులు గురుకుల్ స్కూల్స్ భవనాల ముందు పడిగాపులు పడుతున్నారు.

విద్యాలయాల ముందు విద్యార్థుల పడిగాపులు
రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాలలో అద్దె భవనాలలో కొనసాగుతున్న గురుకుల పాఠశాలలు మూతపడిన నేపధ్యంలో దిక్కు తోచని స్థితిలో ఉన్నారు విద్యార్థులు, ఉపాధ్యాయులు. అసలేం జరిగిందో తెలీక గందరగోళానికి గురై, విద్యాలయాల ముందు పడిగాపులు పడుతున్నారు. అయితే ఇప్పటికే నోటీసు ఇచ్చిన నేపధ్యంలో తాళాలు వేశామని అద్దె భవనాల యజమానులు చెప్తున్నారు.
బకాయిలు చెల్లిస్తేనే తాళాలు తెరుస్తాం
మార్చి నెల నుండి ఇప్పటివరకు గురుకుల స్కూల్స్ కు బకాయిలు చెల్లించనందున, కొన్ని గురుకుల స్కూల్స్ కు గత 30 నెలలకు పైగా అద్దె బాకీల విషయంలో అనేకమార్లు కమీషన్ స్థాయిలో వినతి పత్రాలు ఇచ్చినా ఏ విధమైన స్పందన ఇప్పటికే ఇచ్చిన నోటీసు ఆధారంగా నేడు భవనాలకు తాళాలు వేసి, బకాయిలు చెల్లించిన తర్వాత మళ్ళీ తాళాలు తెరుస్తామని, ఈ అసౌకర్యానికి చింతిస్తున్నాం అని వారు చెప్తున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా మూతపడిన గురుకుల స్కూల్స్
మా బాధలు అర్ధం చేసుకోవాలని తెలంగాణా సమాజానికి విజ్ఞప్తి చేస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వరంగల్ జిల్లాలోని ఉర్సు సమీపంలో ఉన్న గురుకుల స్కూల్, అలాగే యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ మండల కేంద్రంలోనూ, మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని తాండూరు మహాత్మా జ్యోతీబా పూలే గురుకుల స్కూల్ మరియు కళాశాలలకు లాక్ చేసి తమ బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు.
బకాయిలు చెల్లించని కారణంగా లాక్
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ భవనానికి కూడా తాళం వేసి బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. తొర్రూరు మండల కేంద్రంలోని మహాత్మా జ్యోతీబా పూలే బీసీ వెల్ఫేర్ గురుకుల స్కూల్ కూడా బకాయిలు చెల్లించని కారణంగా తాళాలు వేశారు.
-
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి? -
టమాటో నువ్వుల పచ్చడి.. ఈజీగా ఇలా చేసుకోండి..!!












Click it and Unblock the Notifications