ఈసారి శాలరీ హైక్స్ లేనట్టే.. టెక్కీలకు షాక్
ట్రంప్ టారిఫ్ ల నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థ పైన ప్రభావం చూపించింది. మనదేశంలోని టాప్ టెన్ కంపెనీలలో ఒకటిగా ఉన్న విప్రో కూడా ట్రంప్ తాజాగా తీసుకున్న నిర్ణయాలతో ప్రభావితమైంది. కొత్త ఆర్థిక సంవత్సరంలో ట్రంప్ నిర్ణయాలతో ఐటీ సేవల రంగం భారీగా ప్రభావితమైంది.
టెక్కీలకు విప్రో షాక్
ఈ క్రమంలోనే యూరప్, అమెరికాలో ఎక్కువ మంది క్లైంట్ లు ఉన్న కంపెనీ అయిన విప్రో తాజాగా తమ కంపెనీలో పనిచేస్తున్న టెక్కీలకు ఊహించని షాక్ ఇచ్చింది. ప్రస్తుతం కంపెనీలో పని చేసే ఉద్యోగులకు వేతనాల పెంపు విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. తన నాలుగవ త్రైమాసిక ఆర్థిక ఫలితాలను విడుదల చేసిన విప్రో ప్రస్తుతం లాభాల విషయంలో మార్కెట్ అంచనాలను అందుకోలేకపోయింది .

ఉద్యోగులకు వేతనాల పెంపు లేదన్న విప్రో
ఇక నేడు ఇంట్రాడేలో షేర్ ధర భారీగా క్షీణించింది. ప్రస్తుతం వ్యాపారంలో కొనసాగుతున్న ఒడిదుడుకుల నేపథ్యంలో, ఈ త్రైమాసికంలో నష్టాలను చూసిన విప్రో ప్రస్తుతం ఉద్యోగులకు వేతనాల పెంపు లేదని తేల్చి చెప్పేసింది. తమ ఉద్యోగులకు శాలరీ హైక్స్ విషయంలో ప్రస్తుతం తాము చాలా దూరంగా ఉన్నామని, సమయం వచ్చినప్పుడు హైక్స్ గురించి ప్రకటన చేస్తామని చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్ సౌరభ్ గోవిల్ పేర్కొన్నారు.
ఈ ఆర్ధిక సంవత్సరం ఆరంభంలోనే ఒడిదుడుకులు
గత ఆర్థిక సంవత్సరంలో విప్రో పదివేల మంది టెక్ ప్రెషర్ లను రిక్రూట్ చేసుకుంది. ఇక కొత్త ఆర్థిక సంవత్సరంలో ఒడిదుడుకుల కారణంగా నియామకాల విషయంలో జాగ్రత్తగా ఉండాలని విప్రో భావిస్తుంది. 2024 సెప్టెంబరు కంపెనీ చివరగా తన ఉద్యోగులకు వేతన పెంపు లను అందించింది. దానికి ముందు డిసెంబర్ 2023 లోను కంపెనీ హైక్స్ ఇచ్చింది .
వేతన పెంపు కోసం చూస్తున్న టెక్కీలకు నిరాశ
ఇక ఈ క్రమంలో ఈ సంవత్సరం కూడా మూడవ త్రైమాసికం చివర్లో లేదా లాస్ట్ క్వార్టర్లో విప్రో హైక్స్ ఇచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఏదేమైనా ఇప్పుడు వేతన పెంపు కోసం ఎదురుచూస్తున్న టెక్కీలకు మాత్రం విప్రో భారీ షాకే ఇచ్చిందని చెప్పాలి.












Click it and Unblock the Notifications