చికిత్స కోసం వస్తే.. గాంధీలో టిఆర్ఎస్ ఎమ్మెల్యే భార్యకు షాక్
సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలోని నిర్లక్ష్యంపై పలుమార్లు విన్నాం. మరోసారి ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం బయటపడింది. ఈసారి ఏకంగా ఎమ్మెల్యే భార్యను పట్టించుకోలేదు. దీనిపై విమర్శలు వస్తున్నాయి.
హైదరాబాద్: సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలోని నిర్లక్ష్యంపై పలుమార్లు విన్నాం. మరోసారి ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం బయటపడింది. ఈసారి ఏకంగా ఎమ్మెల్యే భార్యను పట్టించుకోలేదు. దీనిపై విమర్శలు వస్తున్నాయి.
దుబ్బాక ఎమ్మెల్యే రామలింగా రెడ్డి భార్య సుజాత తన సోదరుడి కుమారుడిని చికిత్స కోసం మంగళవారం గాంధీ ఆసుపత్రికి తీసుకు వచ్చారు. అక్కడ సిబ్బంది పట్టించుకోలేదు.

దీంతో ఎమ్మెల్యే భార్యనే వీల్ ఛైర్ తీసుకొచ్చి అతడిని కూర్చోబెట్టి ఆసుపత్రిలోకి తీసుకు వెళ్లారు. ఒక ఎమ్మెల్యే భార్య పరిస్థితే ఇలా ఉంటే సామాన్యుల పరిస్థితి ఏమిటని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రోగుల బంధువులు.












Click it and Unblock the Notifications