రేవంత్‌కు బిగ్ షాక్, రివర్స్: వెంట వచ్చిన వాళ్లు తిరిగి టీడీపీలోకి

Posted By:
Subscribe to Oneindia Telugu
Big Shock To Revanth Reddy రేవంత్‌కు బిగ్ షాక్ | Oneindia Telugu

హైదరాబాద్: కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీలో చేరిన కొందరు తెలుగుదేశం పార్టీ నాయకులు తిరిగి టీడీపీలోకి వస్తున్నారా? అనే చర్చ సాగుతోంది. అందుకు ఓ కారణం ఉంది.

కేసీఆర్‌కు కొత్త చిక్కు: రాజీనామా ఆమోదిస్తే రేవంత్ గట్టి షాకివ్వక తప్పదు?

 ఢిల్లీకి వచ్చిన నేత రేవంత్ వెంట

ఢిల్లీకి వచ్చిన నేత రేవంత్ వెంట

రేవంత్ వెంట ఢిల్లీ వెళ్లిన పార్టీ రాష్ట్ర కార్యదర్శి, ఫిలిం సెన్సార్ బోర్డు సభ్యులు వేణు మాధవ్ గురువారం ఏపీ సీఎం, టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు సమావేశంలో పాల్గొన్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీలో సర్దుబాటు కాలేక కొందరు నేతలు తిరిగి వచ్చినా ఆశ్చర్యం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి.

టీఎన్ఎస్ఎఫ్ నేత ఇలా

టీఎన్ఎస్ఎఫ్ నేత ఇలా

టీఎన్ఎస్ఎఫ్ అధ్యక్షుడిగా పని చేసిన చిలుక మధుసూదన్ రెడ్డి కూడా ఎన్టీఆర్ భవన్‌కు వచ్చారు. పార్టీని విడిచి వెళ్లి తాను పెద్ద పొరపాటు చేశానని పార్టీ నాయకులతో అన్నారని తెలుస్తోంది.

 పార్టీని విడిచి పొరపాటు చేశానని

పార్టీని విడిచి పొరపాటు చేశానని

ఈ విషయాన్ని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఇనుగాల పెద్దిరెడ్డి గురువారం నాటి తెలంగాణ టీడీపీ సమన్వయ కమిటీ భేటీలో ప్రకటించారు. తాను పార్టీని విడిచి పొరపాటు చేశానని మధు చెప్పారని పెద్దిరెడ్డి తెలిపారు. ఆయితే మధు చేరికపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది.

 ఆ ప్రచారం వట్టిదే

ఆ ప్రచారం వట్టిదే

అంతేకాదు, రేవంత్ కాంగ్రెస్‌లోకి వెళ్లిన తర్వాత ఇంకొందరు నేతలు పరిస్థితి చూసి టీడీపీని వీడుతారనే చర్చ సాగింది. కానీ చాలామంది నేతలు తాము టీడీపీలోనే ఉంటామని చెప్పారు. అంతేకాకుండా గురువారం చంద్రబాబు తెలంగాణ టీడీపీ నేతల్లో కొత్త ఉత్సాహం నింపారు.

 ఎవరూ అధైర్యపడవద్దు

ఎవరూ అధైర్యపడవద్దు

తన ప్రాణం ఉన్నంతవరకు టీడీపీలోనే ఉంటానని, పార్టీని కాపాడుకునేందుకు చివరి రక్తపు బొట్టు వరకు పోరాడుతానని ఆ పార్టీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు రేవూరి ప్రకాశ్ రెడ్డి ఇటీవల చెప్పారు. కొందరు నాయకులు పార్టీని వీడినంత మాత్రాన నాయకులు, శ్రేణులు అధైర్యపడొద్దన్నారు.

 టీడీపీ పని ఖతమైందంటే ఇలా

టీడీపీ పని ఖతమైందంటే ఇలా

తెలంగాణలో టీడీపీ పని అయిపోంయిదన్న ప్రచారాన్ని టీడీపీ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. తెలంగాణ ఉన్నన్ని రోజులు టీడీపీ ఉంటుందని, ఇలాంటి ఆటుపోట్లను పార్టీ గతంలో అనేకసార్లు ఎదుర్కొన్నదని చెబుతున్నారు. తాను తెరాసలో చేరుతున్నట్టు వచ్చిన వార్తలు పుకార్లేనని, అవసరమైతే రాజకీయాల నుంచి వైదొలగుతానే తప్ప టీడీపీనీ వీడనని చెప్పారు.

 అది రాజకీయ పునరేకీకరణ ఎలా అవుతుంది

అది రాజకీయ పునరేకీకరణ ఎలా అవుతుంది

రేవంత్, సీతక్క తేనెపూసిన కత్తులనీ, పైకి తీయగా మాట్లాడుతూనే వెన్నుపోటు పొడిచారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ పునరేకీకరణ కోసమే కాంగ్రెస్‌లో చేరామంటూ రేవంత్‌, సీతక్క కుంటిసాకులు చెబుతున్నారంటున్నారు. అనేక కుంభకోణాలకు పాల్పడి వేల కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం చేసిన కాంగ్రెస్‌ పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకురావడానికి చేస్తున్న ప్రయత్నాన్ని ఏ విధమైన రాజకీయ పునరేకీకరణ అంటారని ప్రశ్నిస్తున్నారు.

 రేవంత్ మైండ్ గేమ్ ఆడుతున్నారు

రేవంత్ మైండ్ గేమ్ ఆడుతున్నారు

కాంగ్రెస్‌లో చేరిన రేవంత్ మైండ్‌గేమ్‌ ఆడుతున్నారని టీడీపీ నేతలు భావిస్తున్నారు. అందులో భాగంగానే తెలంగాణ టీడీపీ నుంచి మరికొందరు వస్తారనే ప్రచారం జరిగిందని, రాజకీయ పునరేకీకరణ అంటున్నారని చెబుతున్నారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకలల జీవిత భాగస్వామిని కనుగొనండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Shock To Revanth Reddy, who joined Congress Party. Some leaders, who joined Congress along with Revanth Reddy, are now taking U turn to join Telugu Desam Party.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి