ప్రియాంకా రెడ్డికి బలవంతంగా మద్యం తాగించి దారుణం: మృతదేహాన్ని వదలని కీచకులు
తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా యావత్ దేశంలో సంచలనం సృష్టించిన ప్రియాంక రెడ్డి గ్యాంగ్ రేప్, హత్య కేసును పోలీసులు 48 గంటల్లోనే చేయించారు. లారీ డ్రైవర్లు, క్లీనర్లు ఈ ఘాతుకానికి పాల్పడినట్టు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో ప్రియాంక చౌదరి తన సోదరి భవ్య కు చేసిన ఫోన్ కాల్ ఆధారంగా, సిసి టీవీ ఫుటేజ్ ఆధారంగా చేసుకొని కేసును త్వరితగతిని ఛేదించారు. ఇక ఈ కేసుకు సంబంధించి ప్రియాంక రెడ్డి పై గ్యాంగ్ రేప్ చేసిన నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు తమదైన శైలిలో విచారణ చేశారు. దీంతో ప్రియాంక రెడ్డి హత్య కేసులో దారుణమైన నిజాలు వెలుగులోకి వచ్చాయి.

ప్రియాంకా రెడ్డిపై ఫుల్లుగా మద్యం సేవించిన నలుగురు మృగాళ్ళ దాడి
ప్రియాంక రెడ్డి తన స్కూటీ పాడైయిందని, ఇక్కడ ఉన్న లారీ డ్రైవర్లు సహాయం చేస్తామని స్కూటీ తీసుకువెళ్లారని చెల్లెలు భవ్య కు కాల్ చేసి చెప్పింది. తనకు చాలా భయంగా ఉందని దాదాపు 9.28 నిమిషాల వరకు చెల్లెలు భవ్యతో మాట్లాడింది. ఇక పోలీసుల కథనం ప్రకారం నిందితులు 9:30 గంటల ప్రాంతంలో ప్రియాంక రెడ్డిని అపహరించి నిర్మానుష్య ప్రాంతానికి లాక్కెళ్లారు నలుగురు మానవ మృగాలు. ఫుల్లుగా మద్యం సేవించి ఉన్నవారు ఆమెపై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు.

హెల్ప్ హెల్ప్ అంటున్న ప్రియాంకకు బలవంతంగా మద్యం తాగించి దారుణం
ఆ తరువాత ఆమె నోరు మూసి అత్యాచారం చేశారు.ఆమె హెల్ప్ హెల్ప్ అని అరుస్తుండటంతో ఆమెకు బలవంతంగా మద్యం తాగించారు. దీంతో ప్రియాంక రెడ్డి అపస్మారక స్థితిలోకి వెళ్ళింది. పూర్తిగా మద్యం మత్తులో ఉన్న నరరూప రాక్షసులు ఏం చేస్తున్నారో అర్థం కాని స్థితిలో ప్రియాంక రెడ్డిముక్కు, నోరు గట్టిగా మూయడంతో ఆమె మరణించింది.అక్కడి నుంచి ప్రియాంక రెడ్డి మృతదేహాన్ని క్యాబిన్ లో వేసుకొని పలుమార్లు మృతదేహంపై అత్యాచారం చేశారని తెలుస్తుంది.

మృతదేహంపైన కూడా అత్యాచారం చేసిన దుండగులు
మృతదేహంపైన కూడా కామవంచ తీర్చుకున్న పశు ప్రవృత్తికి సభ్య సమాజం నివ్వెరపోతుంది . ఆ తరువాత ఆమెను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి పెట్రోల్ పోసి తగలబెట్టారు.పోలీసుల విచారణలో తెలిసిన ఈ నిజాలు వింటుంటేనే ఒళ్లు గగుర్పొడుస్తుంది. మన మధ్యనే నిత్యం తిరుగుతూ ఇలాంటి నరరూప రాక్షసులు ఉన్నారా అని భయం కలుగుతుంది. మృతదేహాన్ని కూడా వదలని వాళ్ళ స్వభావం వారిలోని పైశాచికత్వానికి పరాకాష్ట గా నిలిచింది. ప్రియాంక రెడ్డి ఊహించని విధంగా నలుగురు కామాంధులు తన మీద దాడి చేస్తుంటే ఈ బాధను ఎలా భరించిందో తలచుకుంటేనే భయం కలుగుతుంది.
Recommended Video

నేడు ఫాస్ట్ ట్రాక్ కోర్టులో నిందితులు .. ఉరి శిక్ష వెయ్యాలని డిమాండ్
ఈ కేసులో అరెస్ట్ చేసిన నలుగురు నిందితులను ఈరోజు మహబూబ్ నగర్ ఫాస్ట్ ట్రాక్ కోర్టులో ప్రవేశపెట్టబోతున్నారు.అయితే వీరికి ఉరిశిక్ష వేయాలని డిమాండ్ ప్రధానంగా వినిపిస్తుంది. వీరి తరపున వాదించడానికి ఏ లాయర్ ముందుకు రావద్దు అని ప్రియాంక రెడ్డి తల్లిదండ్రులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇలాంటి మానవ మృగాలను సమాజంలో తిరగనిస్తే మరిన్ని దారుణాలు చేస్తారని మహిళలు మండిపడుతున్నారు. కాబట్టి వీరికి మరణదండన సరైనదని ఏకకంఠంతో నినదిస్తున్నారు. రోజురోజుకి పెరుగుతున్న ఇలాంటి దారుణాలను అరికట్టాల్సిన నైతిక బాధ్యత సమాజంలోని ప్రతి ఒక్కరి మీద ఉందని భావిస్తున్న తరుణంలో మగాళ్లను మృగాళ్లలా పెంచకండి అని ఆడపిల్లల తల్లిదండ్రులు విజ్ఞప్తి చేస్తున్నారు.












Click it and Unblock the Notifications