షాకింగ్: పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు!!
చమురు సంస్థలు గ్యాస్ వినియోగదారులకు మరోమారు షాక్ ఇచ్చాయి. ఆయిల్ కంపెనీలు వాణిజ్య సిలిండర్ ధరలను పెంచాయి చమురు మార్కెటింగ్ కంపెనీలు వాణిజ్య ఎల్పిజి సిలిండర్ల ధరలను సిలిండర్ పై ఏడు రూపాయలు చొప్పున పెంచాయి. జూన్ నెలలో ధరలను కాస్త తగ్గించిన తర్వాత మళ్లీ ఇప్పుడు ధరలను పెంచాయి.
చమురు సంస్థల తాజా నిర్ణయంతో 19 కిలోల గ్యాస్ సిలిండర్ ధర దేశ రాజధాని ఢిల్లీలో 1773 రూపాయల నుంచి 1780 రూపాయలకు చేరుకుంది. కలకత్తాలో 1902 రూపాయలు, ముంబైలో 1740 రూపాయలు, చెన్నైలో 1952 రూపాయలు గానూ ఉంది. ఇక జూన్ నెలలో వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరలు తగ్గించారు.

జూన్ నెలలో 19 కిలోల ఎల్పిజి సిలిండర్ ధరలు ఢిల్లీలో 1773 రూపాయలు, ముంబైలో 1725 రూపాయలు గానూ, కలకత్తాలో 1875. 50 పైసలు గానూ, చెన్నైలో 1937 రూపాయలు గానూ కొనసాగాయి. జూన్ నెలలో వాణిజ్య అవసరాలకు ఉపయోగించే గ్యాస్ సిలిండర్ ధరను రూ. 83 .50 పైసలు తగ్గించారు.గృహావసరాలకు వినియోగించే ఎల్పిజి సిలిండర్ల ధర మార్చి నుంచి మారలేదు.
19 కిలోల ఎల్పిజి గ్యాస్ సిలిండర్ ప్రధానంగా పారిశ్రామిక మరియు వాణిజ్య అవసరాలకు ఉద్దేశించబడింది. ఇక దీనితో పాటు వాణిజ్య అవసరాలకు ఉపయోగించే వాటిలో 47.5 కిలోలు 42.5 కిలోల ఎల్పిజి సిలిండర్లు కూడా ఉన్నాయి. ఇక గృహావసరాలకు వినియోగించే వాటిలో ఐదు కిలోలు మరియు 14.2 కిలోల ఎల్పిజి సిలిండర్లు ఉన్నాయి.

సహజంగా ఎల్పిజి సిలిండర్ల రేట్లు ప్రతి నెల మొదటి రోజున సవరించబడతాయి. ఏప్రిల్, మే, జూన్ నెలలో ఎల్పిజి సిలిండర్ల ధరలు తగ్గిన తర్వాత జులైలో ప్రస్తుతం ధరలు పెరిగాయి. ఇదిలా ఉంటే దేశ రాజధాని ఢిల్లీలో దేశీయ గ్యాస్ సిలిండర్ ధరలు 14.2 కిలోల ఎల్పిజి సిలిండర్ ధర 1103 రూపాయలు ఉండగా, కలకత్తాలో 1129 రూపాయలు, ముంబైలో రూ. 1102.50పైసలు, చెన్నైలో 1118. 50పైసలుగా ప్రస్తుతం కొనసాగుతున్నాయి.












Click it and Unblock the Notifications