రాఖీపండుగ వేళ షాకింగ్ న్యూస్.. అటవీ అధికారుల కళ్ళలో కారం కొట్టి కర్రలతో దాడి!
రాఖీ పండుగ వేళ అటవీ అధికారులపైన గిరిజనులు దాడికి పాల్పడిన ఘటన చోటుచేసుకుంది. అటవీ భూమిని ఆక్రమించేందుకు ప్రయత్నించిన వారిని అటవీ అధికారులు అడ్డుకున్న క్రమంలో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. అటవీ అధికారులను గిరిజనులు ముట్టడించి గాయపరిచిన సంఘటన ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
అటవీ భూమిలో గుడిసెలు వేసిన గిరిజనులు
ఆసిఫాబాద్ జిల్లాలోని జైనూరు, సిర్పూర్ (యు), లింగాపూర్ మండలాలకు చెందిన 35 మంది వ్యక్తులు మంచిర్యాల జిల్లాలోని కవ్వాల్ టైగర్ రిజర్వ్ పరిధిలోని ఇందన్‌పల్లి అటవీ రేంజ్‌లోని పాలగోరిల ప్రాంతంలో అటవీ ప్రాంతంలో గుడిసెలు వేశారు. 35 మంది గిరిజనులు అటవీ భూమిని ఆక్రమించుకునేందుకు ప్రయత్నించారు.

అటవీ భూమిలో గుడిసెలు తొలగించమన్న అటవీ సిబ్బంది
అయితే జై నూరు, సిర్పూర్ యు, లింగాపూర్ మండలాలకు చెందిన వారు కవ్వాల్ టైగర్ రిజర్వు పరిధిలోని ఇందన్ పల్లి అటవీ రేంజ్ లోని పాల గోరీల ప్రాంతంలో అక్రమంగా నిర్మించిన ఈ గుడిసెలను తొలగించమని అటవీ సిబ్బంది వారికి సూచించారు. గత కొద్ది రోజులుగా వారికి అక్రమ నిర్మాణాలు తొలగించాలని కౌన్సిలింగ్ ఇస్తున్నారు.
అటవీ సిబ్బందిపై దాడి
అయితే అక్కడ అక్రమ నిర్మాణాలను తొలగించని వారు అటవీ సిబ్బంది పైన ఊహించని విధంగా దాడికి పాల్పడ్డారు. అటవీ అధికారుల కళ్ళల్లో కారం చల్లి, కర్రలతో దాడి చేశారు.ఈ దాడిలో అటవీ సెక్షన్ అధికారి రాజేందర్, బీట్ అధికారి సంతోష్ గాయపడ్డారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం మంచిర్యాల ఆసుపత్రికి తరలించారు. అటవీ సిబ్బందిపై దాడి చేసిన వారిపై జన్నారం పోలీసు స్టేషన్‌లో అధికారులు ఫిర్యాదు చేశారు.
కేసు నమోదు చేసి దర్యాప్తు
దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అటవీ, వన్యప్రాణి చట్టాల ప్రకారం ఆక్రమణదారులపై కేసు నమోదు చేశారు. దాడికి పాల్పడిన వారిని అరెస్ట్ చేసి, వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోనున్నారు. అటవీభూమి ఆక్రమించవద్దని, ఆక్రమిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని అటవీ అధికారులు గత రెండు, మూడు రోజులుగా వారికి కౌన్సిలింగ్ ఇస్తున్నారు. ఈ కౌన్సిలింగ్ ప్రక్రియలో గ్రామ పెద్దలు, సంఘ పెద్దల సహాయం తీసుకున్నారు. అంతేకాదు భవిష్యత్తులో ఇటువంటి ఆక్రమణలు జరగకుండా అధికారులు పటిష్ట చర్యలు తీసుకుంటున్నారు.












Click it and Unblock the Notifications