హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జడ్చర్లలో ఎస్సై సిద్ధయ్యకు అంత్యక్రియలు (ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: నల్గొండ జిల్లాలోని జానకీపురం వద్ద సిమీ ఉగ్రవాదులతో తూటాలకు ఎదురొడ్డి నిలిచి తన ప్రాణాలను సైతం అర్పించిన ఎస్‌ఐ సిద్దయ్య భౌతిక కాయానికి నేడు అంత్యక్రియలు జరుగనున్నాయి. ఆయన స్వగ్రామమైన మహబూబ్‌నగర్‌ జిల్లా, జడ్చర్లలో మధ్యాహ్నం 12 గంటలకు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరపనున్నారు. సిద్దయ్య అంత్యక్రియల్లో పలువురు రాజకీయ నేతలతో పాటు, పోలీసు ఉన్నత అధికారులు పాల్గొననున్నారు.

సిమీ ఉగ్రవాదులతో జరిగిన ఎదురుకాల్పుల్లో తీవ్ర గాయాలుపాలై హైదరాబాద్‌లోని కామినేని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్ని ఎస్‌ఐ సిద్ధయ్య మృతి చెందిన విషయం తెలిసిందే. మంగళవారం సాయంత్రం 4.06 నిమిషాలకు సిద్ధయ్య తుది శ్వాసను విడిచినట్లు ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు.

ఏప్రిల్ 4 నుంచి నగరంలోని ఎల్‌బీ నగర్‌లో ఉన్న కామినేని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సిద్ధయ్య మృతితో కామినేని ఆసుపత్రిలో భావోద్వేగ వాతావరణ నెలకొంది. నాలుగు రోజుల పాటు మృత్యువుతో పోరాడి చివరకు తుది శ్వాస విడిచారు. సిద్ధయ్యను బ్రతికించేందుకు కామినేని వైద్యులు విశ్వప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది.

మరిన్ని ఫోటోలు

జడ్చర్లలో సిద్ధయ్యకు అంత్యక్రియలు

జడ్చర్లలో సిద్ధయ్యకు అంత్యక్రియలు

సిమీ ఉగ్రవాదులతో జరిగిన ఎదురుకాల్పుల్లో తీవ్ర గాయాలుపాలై హైదరాబాద్‌లోని కామినేని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్ని ఎస్‌ఐ సిద్ధయ్య మృతి చెందిన విషయం తెలిసిందే. మంగళవారం సాయంత్రం 4.06 నిమిషాలకు సిద్ధయ్య తుది శ్వాసను విడిచినట్లు ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు.

జడ్చర్లలో సిద్ధయ్యకు అంత్యక్రియలు

జడ్చర్లలో సిద్ధయ్యకు అంత్యక్రియలు

ఏప్రిల్ 4 నుంచి నగరంలోని ఎల్‌బీ నగర్‌లో ఉన్న కామినేని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సిద్ధయ్య మృతితో కామినేని ఆసుపత్రిలో భావోద్వేగ వాతావరణ నెలకొంది.

జడ్చర్లలో సిద్ధయ్యకు అంత్యక్రియలు

జడ్చర్లలో సిద్ధయ్యకు అంత్యక్రియలు

నాలుగు రోజుల పాటు మృత్యువుతో పోరాడి చివరకు తుది శ్వాస విడిచారు. సిద్ధయ్యను బ్రతికించేందుకు కామినేని వైద్యులు విశ్వప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది.

 జడ్చర్లలో సిద్ధయ్యకు అంత్యక్రియలు

జడ్చర్లలో సిద్ధయ్యకు అంత్యక్రియలు

సిద్ధయ్య అంత్యక్రియలు బుధవారం ఆయన స్వగ్రామమైన మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలో నిర్వహించనున్నారు. పట్టణంలోని ఆలూరురోడ్డు సమీపంలోగల తండ్రి సమాధి వద్దే ముస్లిం సంప్రదాయ పద్ధతిలో జరుగుతాయని ఆయన కుటుంబసభ్యులు తెలిపారు. అధికార, పోలీసు లాంఛనాలతో ఆయనకు కడపటి వీడ్కోలు పలుకనున్నారు.

 జడ్చర్లలో సిద్ధయ్యకు అంత్యక్రియలు

జడ్చర్లలో సిద్ధయ్యకు అంత్యక్రియలు

2012లో ఎస్‌ఐ ఉద్యోగంలో సిద్ధయ్య చేరాడు. సిద్ధయ్య స్వగ్రామం మహబూబ్ నగర్‌లోని జడ్చెర్ల గ్రామం. సిద్ధయ్య కుటుంబం 20 ఏళ్ల క్రితం కర్నూలు జిల్లా నుంచి జడ్చెర్లకు వచ్చి స్ధిరపడింది. సిద్ధయ్యకు ఇద్దరు అన్నదమ్ములు. బుధవారం మధ్యహ్నం 12గంటల సమయంలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు ఆయన సోదరుడు దస్తగిరి తెలిపారు.

జడ్చర్లలో ఎస్సై సిద్ధయ్యకు అంత్యక్రియలు

జడ్చర్లలో ఎస్సై సిద్ధయ్యకు అంత్యక్రియలు

అంత్యక్రియల్లో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి, డీజీపీ అనురాగ్‌శర్మతోపాటు పలువురు ఉన్నతాధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొంటారు. ఈ మేరకు డీఎస్పీ కృష్ణమూర్తి ఆధ్వర్యంలో స్థానిక పోలీసులు, రెవెన్యూ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

 జడ్చర్లలో సిద్ధయ్యకు అంత్యక్రియలు

జడ్చర్లలో సిద్ధయ్యకు అంత్యక్రియలు

అత్యంత ధైర్య సాహసాలు ప్రదర్శించిన సిద్ధయ్య కేవలం పోలీసులకే కాకుండా ప్రజలందరికీ స్ఫూర్తిగా నిలుస్తారని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. ఆత్మకూర్(ఎం) ఎస్‌ఐ సిద్ధయ్య మరణం పట్ల ముఖ్యమంత్రి ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తంచేశారు. చికిత్స పొందుతున్న సిద్ధయ్య తుదిశ్వాస విడిచారనే సమాచారం తెలిసిన వెంటనే సీఎం తీవ్రంగా కలత చెందారు.

 జడ్చర్లలో సిద్ధయ్యకు అంత్యక్రియలు

జడ్చర్లలో సిద్ధయ్యకు అంత్యక్రియలు

శరీరంలోని రెండు బుల్లెట్లను తొలగించారు. కానీ.. మెదడులో ఉన్న బుల్లెట్ తీస్తే ప్రాణానికి హాని కలిగే అవకాశం ఉండటంతో దానిని బయటకు తీయలేదు. సిద్ధయ్య ప్రాణాలను ఎట్టిపరిస్థితుల్లోనూ కాపాడాలని, ఎంత ఖర్చయినా భరించేందుకు సిద్ధంగా ఉన్నామని ఎస్‌ఐని చూసేందుకు శనివారం కామినేని ఆస్పత్రికి వచ్చిన సందర్భంగా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రకటించారు

 జడ్చర్లలో సిద్ధయ్యకు అంత్యక్రియలు

జడ్చర్లలో సిద్ధయ్యకు అంత్యక్రియలు

ఉస్మానియా వద్ద సిద్ధయ్య మృతదేహానికి రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, నల్గొండ ఎంపీ బూరనర్సయ్యగౌడ్, ఐజీ బాలనాగదేవి, అడిషనల్ డీజీ గోపీకృష్ణ, ఎల్బీనగర్ డీసీపీ ఎక్బాల్, ఏసీపీ స్నేహిత ఇతర పోలీసు ఉన్నతాధికారులు నివాళులు అర్పించారు.

జడ్చర్లలో సిద్ధయ్యకు అంత్యక్రియలు

జడ్చర్లలో సిద్ధయ్యకు అంత్యక్రియలు

ఈ సందర్భంగా హోంమంత్రి విలేకరులతో మాట్లాడుతూ సిద్ధయ్య విధి నిర్వహణలో ప్రాణాలు లెక్కచేయకుండా ఉగ్రవాదులతో పోరాడి వీర మరణం పొందాడని చెప్పారు. మొక్కవోని ధైర్యంతో దుండగులను అక్కడికక్కడే మట్టి కరిపించడం తెలంగాణ పోలీసుల ధైర్య సాహసాలకు నిదర్శనమన్నారు.

జడ్చర్లలో సిద్ధయ్యకు అంత్యక్రియలు

జడ్చర్లలో సిద్ధయ్యకు అంత్యక్రియలు

సిద్ధయ్య కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. సిద్ధయ్య కుమారుడికి ప్రభుత్వం తరపున సహాయసహకారాలు అందిస్తామన్నారు.

 జడ్చర్లలో సిద్ధయ్యకు అంత్యక్రియలు

జడ్చర్లలో సిద్ధయ్యకు అంత్యక్రియలు

ఎస్‌ఐ సిద్ధయ్య మృతిపట్ల రాష్ట్ర రవాణా మంత్రి డాక్టర్ పట్నం మహేందర్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తంచేశారు. ఆయన కుటుంబీకులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. సిద్ధయ్య కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని హామీ ఇచ్చారు.

English summary
SI Siddaiah Dead Bodies shifting to his House from Kamineni Hospital.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X