Siddipeta: సిద్దిపేట కలెక్టర్ సంచలన నిర్ణయం.. 106 మంది ఉద్యోగుల సస్పెన్షన్..
రాష్ట్రంలో ప్రస్తుతం ఎన్నికల కోడ్ కొనసాగుతోంది. అయినప్పటికీ పలువురు ఉద్యోగులు కోడ్ ఉల్లంఘిస్తున్నారు. తాజాగా కోడ్ ఉల్లంఘించి రాజకీయ పార్టీ కార్యక్రమంలో పాల్గొన్న ఉద్యోగులపై వేటు పడింది. ఏకంగా 106 మంది ప్రభుత్వ ఉద్యోగులను సస్పెండ్ అయ్యారు. సస్పెండ్ అయిన వారిలో 38 మంది సెర్ఫ్ ఉద్యోగులు ఉన్నారు. వీరిలో ఎపీఎంలు 14, సీసీలు 18 మంది, వీవోలు 4, ఒక్క సీఓ, ఒక సీబీ ఆడిటర్స్ ఉన్నారు. అలాగే 68 మంది ఈజీఎస్ ఉద్యోగులు కూడా సస్పెండ్ అయిన వారిలో ఉన్నారు.
ఈ ఉద్యోగుల్లో నలుగురు ఏపీఎంలు, ఏడుగురు ఈసీలు, 38 మంది టీఏలు, 18 మంది సీఓలు, ఒక్కరు ఎఫ్ఎ ఉన్నారు. వీరిని కలెక్టర్ మంగళవారం మిక్కిలినేని మనుచౌదరి ఉత్తర్వులు జారీ చేశారు. ఆదివారం రాత్రి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్ రామి రెడ్డి సెర్ఫ్, ఈజీఎస్ ఉద్యోగులతో ఓ ఫంక్షన్ హాల్ లో సమావేశమయ్యారు. విషయం తెలుసుకున్న కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఫంక్షన్ హాల్ వద్దకు చేరుకున్నారు. ఫంక్షన్ హాల్ కు తాళం వేశారు.

పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సీపీ ఫంక్షన్ హాల్ కు చేరుకున్నారు. ఫంక్షన్ హాల్‌లో సీసీ పుటేజ్ ను సేకరించారు. ఫంక్షన్ హాల్‌లోని వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాటిని స్టేషన్ కు తీసుకెళ్లారు. ఫ్లయింగ్ స్వ్కాడ్ ఇంచార్జి పృథ్వి ఫిర్యాదు మేరకు బీఆర్ఎస్ మెదక్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి, సుడా మాజీ చైర్మన్ మారెడ్డి రవీందర్ రెడ్డి లపై కేసు నమోదు చేశారు. కాగా వెంకట్ రామి రెడ్డి గతంలో సిద్దిపేట కలెక్టర్ గా పని చేశారు. ఆ తర్వాత రిటైర్మెంట్ తీసుకుని బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వెంకట్ రామి రెడ్డి బిసినెస్ లు ఉన్నాయి.












Click it and Unblock the Notifications