సింగరేణి ప్రైవేటీకరణ వార్తలపై మంత్రి శ్రీధర్ బాబు కీలక ప్రకటన

సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ పై ప్రస్తుతం రగడ కొనసాగుతోంది. సింగరేణి ప్రైవేటీకరణ జరుగుతోందని బీఆర్ఎస్ నేతలు చేస్తున్న ఆరోపణలపై తెలంగాణ మంత్రి డి. శ్రీధర్ బాబు స్పష్టంగా స్పందించారు. సింగరేణిని ప్రైవేటు వ్యక్తులకు అప్పగించే ఆలోచన ప్రభుత్వానికి లేదని, సంస్థను ప్రైవేటీకరించబోమని ఆయన తేల్చి చెప్పారు.

మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు మాట్లాడుతూ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేస్తున్న వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. "12 ఏళ్ల తర్వాత కేటీఆర్‌కు సింగరేణి గుర్తుకొచ్చిందా?" అని ప్రశ్నిస్తూ, గత బీఆర్ఎస్ పాలనలో సంస్థకు భారీ బకాయిలు పేరుకుపోయాయని, కార్మికుల సంక్షేమానికి తగిన ప్రాధాన్యం ఇవ్వలేదని ఆరోపించారు. గత 10 ఏళ్లలో సింగరేణిని కేసీఆర్ కుటుంబం సొంత సంస్థలా వాడుకున్నారని కూడా విమర్శించారు.

Singareni Will Not Be Privatized Minister duddilla Sridhar Babu Clarifies Amid BRS Allegations

సింగరేణి ప్రతిష్ఠను దెబ్బతీసేలా మాట్లాడకూడదని హితవు చెప్పిన మంత్రి, ప్రస్తుత ప్రభుత్వం సంస్థను బలోపేతం చేయడమే లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వమే సింగరేణిని కాపాడిందని గుర్తు చేశారు. టెండర్ల విధానంలో గత పద్ధతులనే అనుసరిస్తున్నామని, బొగ్గు మాయమైందన్న ఆరోపణలు కేవలం రాజకీయ విమర్శలేనని అన్నారు.

యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌ను పూర్తి సామర్థ్యంతో నడపడానికి ఏటా సుమారు 14 మిలియన్ టన్నుల బొగ్గు అవసరమని మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు వివరించారు. గత ప్రభుత్వం కొత్త గనుల అభివృద్ధిపై దృష్టి పెట్టలేదని చెప్పిన ఆయన, ప్రస్తుతం నైనీ కోల్ బ్లాక్ నుంచి బొగ్గు సరఫరా కొనసాగుతోందని తెలిపారు. తాడిచర్ల బ్లాక్‌ను గత ప్రభుత్వమే ప్రైవేటు సంస్థకు అప్పగించిందని, కాంట్రాక్టులు తమ అనుచరులకు కట్టబెట్టారని కూడా ఆరోపించారు.

వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిపై శుభవార్త!
వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిపై శుభవార్త!

సింగరేణి కార్మికులకు దసరా బోనస్ అందిస్తున్నామని, కాంట్రాక్టు ఉద్యోగుల సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తున్నామని మంత్రి హామీ ఇచ్చారు. సింగరేణి తెలంగాణ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇది దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బొగ్గు సంస్థల్లో ఒకటి. దీని భవిష్యత్తు, కార్మికుల ఉపాధి రక్షణపై ప్రభుత్వం కట్టుబడి ఉందని శ్రీధర్ బాబు స్పష్టం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+