ఫేస్‌బుక్ ప్రేమ కాదు, కొందరిలా లేచిపోలేదు, తప్పు చేశా కానీ: మధుప్రియ
అదిలాబాద్: తనది ఫేస్‌బుక్ ప్రేమ కాదని, కొందరిలా తల్లిదండ్రులకు చెప్పకుండా లేచిపోలేదని, అలాగే తన జీవితంలో తాను చేసిన అతిపెద్ద తప్పు తాను తల్లిదండ్రులను ఎదిరించి పెళ్లి చేసుకోవడమేనని, అయితే వారికి నచ్చచెప్పే ప్రయత్నం చేశానని గాయని మధుప్రియ అన్నారు.
ఆమె ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో మాట్లాడారు. మధుప్రియ శ్రీకాంత్‌ను రెండు రోజుల క్రితం పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. తాను అనుకున్నది సాధించానని, అది గోల్ అయినా, ప్రేమ అయినా అన్నారు. అనుకున్నది సాధిస్తే ఆనందంగా ఉంటుందన్నారు.
తాను ఇప్పటి వరకు పేరెంట్స్ చేతిలో పెరిగానని, తల్లిదండ్రుల వల్లే తాను ఈ స్థాయిలో ఉన్నానని చెప్పారు. తాను పెళ్లికి ముందు ఎలా ఉన్నానో, పెళ్లి తర్వాత కూడా అలాగే ఉంటానని తెలిపారు. తమది ఫేస్‌బుక్ ప్రేమ కాదని, ఇరువురికి పరిచయం ఉందని, ఆయన భావాలు తనకు దగ్గరగా ఉండటంతో ప్రేమ మొదలైందన్నారు.

అబ్బాయి తల్లిదండ్రులు అంగీకరించారని, కానీ తన తల్లిదండ్రులకు నచ్చచెప్పే ప్రయత్నం చేసినా ఒప్పుకోలేదన్నారు. తాను అమ్మానాన్నలకు చెప్పకుండా లేచిపోలేదన్నారు. వారిని ఒప్పించేందుకు చాలా ప్రయత్నాలు చేశానని చెప్పారు. కొందరి ప్రేమికుల్లా చేయలేదన్నారు.
అమ్మానాన్నల్ని ఒప్పించేందుకు ప్రయత్నించానని, ధైర్యంగా పెళ్లి చేసుకున్నానని చెప్పారు. ఎప్పటికైనా తన తల్లిదండ్రులు తమను అంగీకరిస్తారని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. నేను నా జీవితంలో చేసిన తప్పు ఏదైనా ఉందంటే, ఇదే అన్నారు. అయితే తాను ఎంత నచ్చచెప్పినా తల్లిదండ్రులు అంగీకరించలేదన్నారు.
తాను అమ్మానాన్నలను మోసం చేయలేదన్నారు. చెప్పకుంటే పెళ్లి చేసుకుంటే మోసం అవుతుందన్నారు. తనకు కొన్ని వ్యక్తిగత సమస్యలు ఉన్నాయని, అందుకే చిన్న వయస్సులో పెళ్లి చేసుకున్నానని, వాటికి ఎవరికీ చెప్పవలసిన అవసరం లేదన్నారు.
పరిస్థితులను బట్టి ఓ సమయంలో పొగడుతారు, మరికొన్ని సందర్భాల్లో తిడతారని, దానికి తాను బాధపడటం లేదన్నారు. తాను ఎల్ఎల్‌బీ చదువుతున్నానన్నారు. తాను అమ్మానాన్నను ఆపోజ్ చేయడం లేదని, వారే తనను దూరం పెట్టారన్నారు. ఎప్పటికైనా వారికి దగ్గరవుతామన్నారు.
మధుప్రియ భర్త మాటలాడుతూ... తమకు వాళ్లు రాలేదన్న బాధ ఉందన్నారు. మరికొన్ని రోజులకైనా మేం వారికి క్షమాపణ చెప్పి కలుస్తామన్నారు. వారు తమను అంగీకరిస్తారనే నమ్మకం ఉందన్నారు. క్షమించాలని తాము మొదటి నుంచి అడుగుతున్నామన్నారు.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!