తనకు, తన కుటుంబానికి ప్రాణహాని: పోలీసులకు సింగర్ సునీత భర్త రామ్ వీరపనేని ఫిర్యాదు

సింగర్ సునీతను పెళ్లి చేసుకున్న తర్వాత రామ్ వీరపనేని వార్తల్లో వ్యక్తి అయ్యారు. సింగర్ గా సునీతకు ఉన్న పాపులారిటీతో, ఆమెను వివాహమాడిన తర్వాత రామ్ వీరపనేని పై కూడా ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఇక ఈ సమయంలో తాజాగా ఆయన తనకు, తన కుటుంబానికి ప్రాణహాని ఉందని పోలీసులను ఆశ్రయించడంతో ప్రస్తుతం ఈ విషయం చర్చనీయాంశమైంది.

ఓ వ్యక్తి నుంచి తనకు తన కుటుంబ సభ్యులకు ప్రాణహాని ఉందని ప్రముఖ గాయని సునీత భర్త రామకృష్ణ వీరపనేని బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బంజారా హిల్స్ నెంబర్ 2 లో ఉమెన్స్ కో ఆపరేటివ్ సొసైటీలో నివసించే రామకృష్ణకు ఓ వ్యక్తి ఫోన్ చేసి వేధిస్తున్నాడు.

Singer Sunitha husband Ram Veerapaneni complaint to police

కేకే లక్ష్మణ్ అనే వ్యక్తి సినీ నిర్మాతల సభ్యుడిని చెబుతూ తరచూ తనకు ఫోన్లు చేస్తున్నాడని, అర్జెంటుగా మాట్లాడాలి అని పిలుస్తున్నాడు అని సునీత భర్త రామకృష్ణ వీరపనేని ఫిర్యాదులో పేర్కొన్నట్టుగా వెల్లడించారు. తాను వ్యక్తిగతంగా కలవాలని కోరగా, అతడిని కలవడం తనకు ఇష్టం లేకపోవడంతో కలవలేదని ఫిర్యాదులో పేర్కొన్నారని తెలిపారు.

పదే పదే విసిగిస్తూ ఉండటంతో తన నెంబర్ బ్లాక్ చేసిన ఆయన, అయినప్పటికీ మరో కొత్త నెంబర్ నుంచి సదరు వ్యక్తి కాల్ చేస్తూ, మెసేజ్ లు పెడుతూ, ఇప్పుడు ఏకంగా బెదిరింపులకు గురి చేస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు. అతనిపై చట్టబద్దమైన చర్యలు తీసుకోవాలని కోరారని పోలీసులు తెలిపారు.

రామ్ వీరపనేని ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక తనకు, తన కుటుంబానికి ప్రాణహాని ఉందని ఆయన ఫిర్యాదు చేయడంతో సింగర్ సునీత విషయంలో ఆమె అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఇంతకీ అతను సునీత భర్తను ఎందుకు బెదిరిస్తున్నాడు? అతనికి, రామ్ వీరపనేనికి మధ్య గొడవ ఏమిటి అని చర్చిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+