పర్సనల్ గా ఫోన్ చేసిన మంత్రి కేటీఆర్
తెలంగాణలో ఎన్నికల ప్రచారం కీలక ఘట్టానికి చేరుకుంది. మరో మూడు రోజుల్లో పోలింగ్ జరగబోతోంది. ప్రచారానికి రేపు ఒక్కరోజే సమయం మిగిలింది. రాష్ట్రంలో ప్రధాన పార్టీలైన బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ ప్రచారానికి రాష్ట్రం హోరెత్తిపోతోంది. గులాబీ పార్టీ తరఫున కేసీఆర్, హరీష్ రావుతోపాటు కేటీఆర్ కూడా దూసుకెళుతున్నారు. ప్రచారం చేయడానికి ఎన్ని మార్గాలైతే ఉన్నాయో అన్నింటినీ కేటీఆర్ ఉపయోగించుకుంటున్నారు.
ప్రధాన మీడియాతోపాటు యూట్యూబ్ ఛానల్స్ ఇంటర్వ్యూలు, సోషల్ మీడియాలోని అన్ని విభాగాల్లో తన సందేశాలను పంపించడంతోపాటు రేడియోల్లో టాక్ షో ద్వారా ప్రచారాన్ని కొత్తపుంతలు తొక్కిస్తున్నారు. ఇంత ప్రచారం చేస్తున్నా ఎక్కడో అసంతృప్తిగా అనిపించడంతో ఓటర్లందరికీ పర్సనల్ గా ఫోన్ చేసి మరీ మాట్లాడుతున్నారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్లతోపాటు హైదరాబాద్ సిటీ ప్రజలకు కూడా కేటీఆర్ ఫోన్ చేస్తున్నారు. IVRS కాల్ ద్వారా నేరుగా ఓటర్లకు ఫోన్ చేసి మాట్లాడుతున్నారు.

నియోజకవర్గంతో పాటు రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని, అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తున్నారు. ఇప్పటికే సిరిసిల్ల నియోజకవర్గ ఓటర్లతో పాటు హైదరాబాద్ ఓటర్లకు కూడా కేటీఆర్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. సిరిసిల్ల, హైదరాబాద్ సిటీతోపాటు రాష్ట్రమంతటా కేటీఆర్ ఫోన్ కాల్స్ వెళుతున్నాయి. ఇప్పటికే ఓటర్లకు IVRS కాల్స్ ద్వారా స్థానిక నాయకులు కాల్స్ చేస్తున్నారు. వీరికి కేటీఆర్ జతకలిశారు. ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలవడంతోపాటు ఎందుకు గెలవాలనే అవసరాన్ని కూడా కేటీఆర్ తనదైనశైలిలో స్పష్టంగా ఓటర్లకు చెబుతున్నారు. అభివృద్ధిని చూసి ఓటేయాలని కోరుతున్నారు.












Click it and Unblock the Notifications