గంటల వ్యవధిలోనే అక్కా, తమ్ముడు అదృశ్యం, ఎందుకు?

కొన్ని గంటల వ్యవధిలోనే అక్కా తమ్ముడు అదృశ్యమైన ఘటన హైద్రాబాద్ పాతబస్తీలో చోటుచేసుకొంది. ఈ ఘటనపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.

హైదరాబాద్:అనుమానాస్పద స్థితిలో అక్కా తమ్ముడు కొద్ది గంటల వ్యవధిలోనే అదృశ్యమయ్యారు. ఈ ఘటన హైద్రాబాద్ పాతబస్తీలో కలకలాన్ని రేపుతోంది. ఈ ఘటనపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.

హైద్రాబాద్ పాతబస్తీలోని చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని కేశవగిరిలో ఈ ఘటన చోటుచేసుకొంది. ఈ ప్రాంతంలో హాజెరా భావజీర్ అనే మహిళ తన ముగ్గరు పిల్లలలు ,తల్లితో కలిసి జీవిస్తోంది.

హాజారే భావజీర్ కు 8 ఏళ్ళ రుఖియా, ఏడేళ్ళ కూతురు జీనత్, ఐదేళ్ళ కొడుకు అబ్దుల్లా బావజీర్ ఉన్నారు.ఆమె భర్త మొహసిన్ షేక్ మరో వివాహం చేసుకొని వేరుగా జీవిస్తున్నాడు. దీంతో హాజారే భావజీర్ తల్లితో కలిసి ఉంటోంది.

sister and brother disappear in hyderabad

ఈ నెల 9వ, తేదిన 2వ, తరగతి చదివే పెద్ద కూతురు రుఖియా, ఒకటో తరగతి చదివే చిన్న కూతురు జీనత్ ఉదయం పూట భార్కస్ లోని ప్రభుత్వ పాఠశాలకు వెళ్ళారు.తరగతులు ముగిసిన తర్వాత చెల్లె కోసం వెతికితే కన్పించడం లేదని పాఠశాల సిబ్బంది చెప్పారు.అయితే ఆందోళనకు గురైన రుఖియా వెంటనే తల్లికి విషయాన్ని చెప్పింది.

అయితే హాజారే భావజీర్ తన రెండో కూతురు వెతికేందుకు పెద్ద కూతురును తీసుకొని వెళ్ళింది.అయితే తన కొడుకు అబ్దుల్లా భావజీర్ ను తల్లి వద్దే ఉంచి వెళ్ళింది.ఎంత వెతికినా ఆమెకు కూతురు జాడ కన్పించలేదు.

తిరిగి తిరిగి ఇంటికి వచ్చింది.అయితే ఇంటికి వస్తే తల్లి వద్ద ఉంచి పోయిన కొడుకు అబ్దుల్లా జాడ కూడ కన్పించలేదు. దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+