డ్రగ్ కేసు: నేడు సిట్ అధికారుల ముందుకు నవదీప్, ప్రత్యేక ప్రశ్నావళి?
డ్రగ్ కేసులో సినీ నటుడు నవదీప్ సోమవారం నాడు సిట్ అధికారుల ముందుకు హజరుకానున్నారు. ఇప్పటికే ఆయనకు సిట్ నుండి నోటీసులు అందాయి.
హైదరాబాద్:డ్రగ్ కేసులో సినీ నటుడు నవదీప్ సోమవారం నాడు సిట్ అధికారుల ముందుకు హజరుకానున్నారు. ఇప్పటికే ఆయనకు సిట్ నుండి నోటీసులు అందాయి.
డ్రగ్ కేసులో కెల్విన్ నుండి సేకరించిన సమాచారం ఆధారంగా సిట్ అధికారులు సినీ ప్రముఖులను వరుసగా విచారిస్తున్నారు. శనివారంతో తరుణ్ విచారణ పూర్తైంది. ఆదివారం నాడు విచారణకు సెలవును ప్రకటించారు.
సోమవారం నాడు నవదీప్‌ను విచారించనున్నారు. అయితే నవదీప్ సిట్ విచారణకు హజరుకానున్న నేపథ్యంలో నవదీప్ ఇంటి వద్ద మీడియా మోహరించింది. అయితే నవదీప్ మాత్రం ఇంటి వద్ద లేడు. రాత్రి నుండి నవదీప్ ఇంటికి రాలేదని సెక్యూరిటీ సిబ్బంది చెప్పారు.

నవదీప్‌కు గచ్చిబౌలిలో ఓ పబ్ ఉందని సిట్ అధికారులు అనుమానిస్తున్నారు. ఈ పబ్‌లో డ్రగ్స్ విక్రయించేవారనే సమాచారాన్ని గుర్తించినట్టు అంటున్నారు.
విచారణ సందర్భంగా ఈ విషయమై మరింత లోతుగా నవదీప్‌ను సిట్ అధికారులు విచారించనున్నారు.అయితే నోటీసులు అందుకొన్న సమయంలోనే తనకు డ్రగ్స్‌తో ఎలాంటి సంబంధం లేదని నవదీప్ మీడియాకు చెప్పారు.
సిట్ అధికారులకు తనకు తెలిసిన సమాచారాన్ని ఇస్తానని ఆయన ప్రకటించారు. కెల్విన్‌తో కూడ సంబంధాలు లేవని ఆయన ప్రకటించారు. అయితే ఈ కేసులో నవదీప్‌ను విచారించేందుకుగాను సిట్ అధికారులు ప్రత్యేక ప్రశ్నావళిని రూపొందించినట్టు సమాచారం.












Click it and Unblock the Notifications