సిట్ విచారణ కార్తీకదీపం సీరియన్ కన్నా అధ్వాన్నం, మీరు మంత్రుల ఫోన్లు ట్యాప్ చేయట్లేదా?
ఫోన్ టాపింగ్ కేసులో సిట్ తనకు నోటీసులు ఇవ్వడం పైన మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. ఈరోజు సిరిసిల్లలో పర్యటించిన ఆయన సిట్ విచారణ పైన షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. సిట్ విచారణ కంటే కార్తీకదీపం సీరియల్ బెటర్ అంటూ కేటీఆర్ వ్యాఖ్యలు చేశారు. కార్తీకదీపం సీరియల్ ముగిసినా, సిట్ విచారణకు మాత్రం అంతం లేదని ఎద్దేవా చేశారు.
సిట్ రేవంత్ రెడ్డి సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్ : కేటీఆర్
రేవంత్ రెడ్డి ప్రభుత్వం పాలన చేతకాక అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్ కు పాల్పడుతుందని కేటీఆర్ విమర్శలు గుప్పించారు. సిట్ రేవంత్ రెడ్డి సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్ అన్నట్టు వ్యవహరిస్తూ టీవీ సీరియల్ డ్రామాలు ఆడుతున్నారని కేటీఆర్ అసహనం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో జిల్లాల విభజన పేరుతో ప్రభుత్వం గందరగోళం సృష్టిస్తోందని, రాజన్న సిరిసిల్ల జిల్లాను ఎత్తివేయాలనే కుట్రలో ముఖ్యమంత్రి ఉన్నారని కేటీఆర్ ఆరోపించారు.

సిట్ నోటీసులు అందుకే
సర్పంచుల ఎన్నికల్లో ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొన్నందువల్ల కార్పొరేషన్ ఎన్నికలు నిర్వహించడానికి ప్రభుత్వం భయపడుతోందని ఆయన ఈరోజు సిరిసిల్లలో వ్యాఖ్యానించారు.
కాళేశ్వరం స్కామ్, ఫోన్ టాపింగ్ అంటూ డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు. సీఎం బావమరిది బొగ్గు స్కామ్ ను హరీష్ రావు బయటపెట్టారని ఉదయం కుంభకోణం బయట పెడితే సాయంత్రానికి నోటీసులు వచ్చాయని కేటీఆర్ అభిప్రాయపడ్డారు.
ఎవరికీ భయపడేది లేదన్న కేటీఆర్
రేవంత్ రెడ్డికి పరిపాలన చేత కాదని అసమర్థ పాలన అని దుయ్యబట్టారు. తాను ఏమీ తప్పు చేయలేదని ఎవరికీ భయపడేది లేదని స్పష్టం చేశారు. సిట్ విచారణకు కచ్చితంగా హాజరవుతానని, ఫోన్ టాపింగ్ కేసులో సంబంధం లేని నేతలను ప్రశ్నించారు అన్నారు. ప్రస్తుత ప్రభుత్వంలో మంత్రుల ఫోన్లు టాప్ చేయట్లేదని ప్రమాణం చేసి చెబుతారా అంటూ నిలదీశారు.
రేవంత్ సర్కార్ లోనూ ఫోన్ ట్యాపింగ్
కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోన్లు టాప్ చేస్తున్నారని, చెబితే ఖండించ లేదని కేటీఆర్ అన్నారు. రేవంత్ సర్కార్ లో ఫోన్ ట్యాపింగ్ జరుగుతుందని మాజీమంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. నా ఫోన్ ట్యాపింగ్ అవుతుందా అని సిట్ అధికారులను అడుగుతా అన్నారు. అయినా ఫోన్ ట్యాపింగ్ ప్రభుత్వాలు చేయవని, పోలీసులు చేస్తారని అన్నారు.












Click it and Unblock the Notifications