TSPSC పేపర్ లీక్ కేసులో బయటపడుతున్న కొత్త పేర్లు..
టీఎస్‍పీఎస్‍సీ పేపర్ లీక్ కేసులో తవ్వేకొద్ది నిజాలు బయటపడుతున్నాయి. ఈ కేసులో కొత్త పేర్లు తెర పైకి వస్తున్నాయి. ప్రస్తుతం ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న ప్రవీణ్, రాజశేఖర్ రెడ్డి, డ్యాక్యా, రాజేశ్వర్ సిట్ కస్టడీలో ఉన్నారు. వీరిని విచారించగా కొత్త పేర్లు బయటకొచ్చాయి. డాక్యా నాయక్, రాజేశ్వర్ ను వారు బస చేసిన హోటల్ కు తీసుకెళ్లిన సిట్ అధికారులు పలు వివరాలు సేకరించారు.
సిట్ అధికారులు గ్రూప్-1 ప్రిలిమ్స్ లో 100 మార్కుల కంటే ఎక్కువ వచ్చిన వారిని విచారిస్తున్నారు. ఈక్రమంలో మార్చి 26వ తేదీన 20 మంది అభ్యర్థులు సిట్ ఆఫీస్ లో నిర్వహించిన విచారణకు హాజరయ్యారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న రాజశేఖర్ రెడ్డి న్యూజిలాండ్ లో ఉన్న తన బావ ప్రశాంత్ రెడ్డికి గ్రూప్-1 ప్రిలిమ్స్ పేపర్ పంపినట్లు పోలీసులు గుర్తించారు. ప్రశాంత్ రెడ్డి పరీక్ష రాసి తిరిగి న్యూజిలాండ్ వెళ్లిపోడవంతో అతనికి మెయిల్, వాట్సాప్ ద్వారా సిట్ నోటీసులు పంపింది.

అతనిపై లుకౌట్ నోటీసులు జారీ చేయడానికి కూడా అధికారులు సిద్ధమైనట్లు తెలుస్తోంది. రాజశేఖర్ ప్రశాంత్ కు వాట్సాప్ ద్వారా పేపర్ పంపాడు. ప్రశాంత్ ఈ పేపర్ మరికొందరికి లీక్ చేసినట్లు తెలిసింది. సిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ షమీమ్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగి రమేశ్, మాజీ టెక్నీషియన్ సురేష్ రిమాండ్ రిపోర్ట్ లో సిట్ కీలక వివరాలు వెల్లడించింది.12 మంది నిందితులు 19 మంది సాక్షులతో కూడిన రిమాండ్ రిపోర్ట్‌ను కోర్టుకు అందించింది.
రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ పరిధిలోని నేరేళ్లచెరువు గ్రామానికి చెందిన రాజేంద్ర కుమార్ అనే యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. టీఎస్‌పీఎస్సీ ప్రశ్నాపత్రం కొనుగోలుకు రూ.10 లక్షలు బేరం కుదుర్చుకున్నాడని, రూ.5 లక్షలు అడ్వాన్స్‌గా చెల్లించినట్లు సిట్ అధికారులు గుర్తించినట్లు సమాచారం. మహబూబ్ నగర్ జిల్లా గండేడ్ మండలం పంచాంగల్ తండకు చెందిన డాక్యా, పాటు సల్కర్‌పేట గ్రామానికి చెందిన తిరుపతయ్యలతో కలిసి రాజేంద్ర కుమార్ గతంలో గండేడ్ మండలంలో జాతీయ ఉపాధి హామీ పథకంలో కలిసి పని చేశారు.












Click it and Unblock the Notifications