టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌ను ప్రశ్నించిన సిట్, కీలక వాంగ్మూలం: మరో ముగ్గురి కస్టడీ

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(TSPSC) పేపర్ లీకేజీ వ్యవహారంలో దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. పేపర్ లీకేజీ కేసులో టీఎస్‌‌పీఎస్సీ ఛైర్మన్ జనార్ధన్ రెడ్డిని సిట్ విచారించింది. దాదాపు 3 గంటలపాటు ఆయనను విచారించి కీలక విషయాలను నమోదు చేసుకున్నారు. పేపర్ లీకేజీ వ్యవహారంపై ఆయనను పలు ప్రశ్నలు అడిగి వివరాలు తెలుసుకున్నారు.

కాన్ఫిడెన్షియల్ విభాగం నుంచి నిందితులు లాగిన్ ఐడీ, పాస్‌వర్డ్, తస్కరించడం నుంచి ప్రశ్నపత్రాల లీక్ వరకు జరిగిన పరిణామాలపై ఆయనను విచారించి వాంగ్మూలం నమోదు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇక కమిషన్‌లో పనిచేసే ఉద్యోగుల విధి విధానాలు, ఎవరెవరు ఏయే బాధ్యతలు నిర్వర్తిస్తారు? అనే విషయాలను అడిగి తెలుసుకున్నారు. ప్రశ్నపత్రాల తయారీ, వాటిని భద్రపర్చడం, పరీక్షలు నిర్వహించే తీరు, దానికి అనుసరించే పద్ధతులపై ఆరా తీసినట్లు తెలిసింది. పేపర్ లీకేజీ నిందితులు ప్రవీణ్ , రాజశేఖర్‌లు ఆఫీస్‌లో చేసిన పని తీరు గురించి ఛైర్మెన్ నుంచి వివరాలు సేకరించినట్లు సమాచారం. కాగా, ప్రవీణ్ , రాజశేఖర్‌ల ల్యాప్‌టాప్ సమాచారాన్ని సిట్ మరోసారి పరిశీలించింది.

SIT questioned TSPSC chairman Janardhan reddy in paper leak case

మరోవైపు, ఈ లీకేజీ కేసులో నిందితులు ప్రశాంత్, రాజేందర్, తిరుపతయ్యను కస్టడీకి ఇవ్వాలని కోరుతూ సిట్ వేసిన పిటిషన్ పై నాంపల్లి కోర్టు విచారించింది. సిట్ అధికారుల అభ్యర్థన మేరకు వారిని మూడు రోజుల పోలీస్ కస్టడీకి న్యాయస్థానం అనుమతి ఇచ్చింది. దీంతో ముగ్గుర్ని మంగళవారం చంచల్ గూడ జైలు నుంచి కస్టడీకి తీసుకుని ఏప్రిల్ 6 వరకు వారిని సిట్ అధికారులు విచారించనున్నారు.

ఇదే కేసులో ముగ్గురు నిందితులను పోలీస్ కస్టడీలోకి అనుమతిచ్చింది నాంపల్లి కోర్టు. ముగ్గురు నిందితులను మూడు రోజుల పాటు కస్టడీకి ఇచ్చింది. ఈ కేసులో ఇటీవల ఆరెస్ట్ అయినా ప్రశాంత్, రాజేందర్, తిరుపతయ్య ను కస్టడీకి అనుమతిచ్చింది. ఏప్రిల్ 4న ఉదయం చంచల్ గూడా జైలు నుండి ముగ్గురు నిందితులను కస్టడీ లోకి తీసుకోనుంది సిట్.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+