కిరాతకం :అత్యాచారం చేస్తూ వీడియో తీశాడు, లొంగదీసుకొన్నాడు
నల్గొండ పట్టణానికి సమీపంలోని ప్రాథమిక పాఠశాలలోని ఆరుగురు విధ్యార్థినిలపై నందకుమార్ అనే యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు.విధ్యార్థినిలు పాఠశాల ప్రధానోపాద్యాయుడికి సమాచారం ఇవ్వడంతో విషయం వెలుగుచూసిం
నల్గొండ : నల్గొండ జిల్లా గిరకబావి గూడెంలోని ప్రాథమిక పాఠశాలలో ఆరుగురు విధ్యార్థులపై నందకుమార్ అనే నిందితుడు అత్యాచారం చేసినట్టు బాలికలు స్కూల్ ప్రధానోపాధ్యాయుడికి ఫిర్యాదు చేశారు. నందకుమార్ ను స్థానికులు చితకబాది పోలీసులకు అప్పగించారు . గ్రామం నుండి నందకుమార్ కుటుంబసభ్యులను వెలివేశారు.
నల్గొండ పట్టణానికి సమీపంలోని గిరకబావిగూడెం చెందిన సుందరయ్య కాలనీలో ఉన్న నందకుమార్ ఆరుగురు విధ్యార్థులపై అత్యాచారం చేశాడు. రెండు మాసాలుగా ఈ ఘటన చోటుచేసుకొంది. ప్రాథమిక పాఠశాలకు సమీపంలోనే ఈ ధారుణానికి పాల్పడుతున్నారు.విద్యార్థులను అత్యాచారం చేసిన వీడియోలను చూపుతూ వారిని లొంగదీసుకొంటున్నాడు.

అయితే అత్యాచారానికి గురైన ఆరుగురు విధ్యార్థులు ఆత్మహత్య చేసుకోవాలని భావించారు. అయితే ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వారిని సముదాయించాడు. వారి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చాడు.
ఈ సమాచారం ఆధారంగా స్థానికులు నందకుమార్ ను పిలిచి విచారించారు. స్థానికులు నిందితుడిని చితకబాదారు. నిందితుడిని పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనతో ప్రాథమిక పాఠశాలలో విధ్యార్థులు భయాందోళనకు గురయ్యారు.












Click it and Unblock the Notifications