కేసీఆర్ కు షాకిచ్చిన ఆరుగురు ఎమ్మెల్యేలు!!
తెలంగాణ రాష్ట్రంలో గత పదేళ్లపాటు తిరుగులేకుండా పాలన సాగించిన బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు అస్తిత్వ పోరాటంలో పడిందా? కారు దిగి వెళ్ళిపోతున్న నేతలతో గులాబీ అధినేత కేసిఆర్ కుదేలవుతున్నారా? వరుసగా ఎమ్మెల్యేలు కెసిఆర్ కు షాక్ ఇవ్వడం ఆ పార్టీని సంక్షోభంలో ముంచేస్తుందా? అంటే అవును అన్న సమాధానమే వస్తుంది.
హస్తం తీర్ధం పుచ్చుకోనున్న ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్
తెలంగాణ రాష్ట్రంలో పదేళ్లపాటు పాలన సాగించిన గులాబీ అధినేత కేసిఆర్ కు పార్టీ నేతలు వరుస షాక్ లు ఇస్తున్నారు. కారు దిగి వెళ్ళడానికి ప్రస్తుతం మరో ఆరుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ తన అనుచరులతో కలిసి నేడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోబోతున్నారు.

ప్రకాష్ గౌడ్ బాటలో మరో ఐదుగురు ఎమ్మెల్యేలు
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకాష్ గౌడ్ పార్టీ మారొద్దని బుజ్జగించినా ఫలితం లేకుండా పోయింది. వరుసగా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, నేతలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడంతో, నడవని కారులో ఉండలేక ప్రకాష్ గౌడ్ కూడా కాంగ్రెస్ పార్టీ తీర్ధం పుచ్చుకోవాలని నిర్ణయించుకొని నేడు పార్టీలో చేరుతున్నట్టు సమాచారం. ఇక ప్రకాష్ గౌడ్ బాటలో మరో ఐదుగురు ఎమ్మెల్యేలు సైతం కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడానికి రెడీ అయినట్టు తెలుస్తోంది.
గంప గుత్తగా కేసీఆర్ కు షాక్
వీరంతా ఇటీవల ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఇన్చార్జి మంత్రి అయిన శ్రీధర్ బాబుతో భేటీ అయ్యారు. అప్పటినుంచి వారు కాంగ్రెస్ లోకి జంప్ అవ్వడానికి సుముఖంగా ఉన్నట్టు తెలుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలలోనూ బిఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి జంప్ అవ్వడానికే ఆయా జిల్లాల వారీగా కాంగ్రెస్ ముఖ్య నేతలతో చర్చలు జరుపుతున్నారు.
పావులు కదుపుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు
ఈ మధ్య శ్రీధర్ బాబుతో భేటీ అయిన ఐదుగురు ఎమ్మెల్యేలు తాము నియోజకవర్గ అభివృద్ధి కోసం మంత్రితో మాట్లాడామని చెబుతున్నప్పటికీ వారు పార్టీ మారడానికే సిద్ధమై మంత్రితో భేటీ అయినట్టుగా తెలుస్తుంది. గ్రేటర్ హైదరాబాద్ లో పరిధిలోనూ మరో నలుగురు ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ వైపే చూస్తున్నారు. ప్రస్తుతం ప్రకాష్ గౌడ్ కూడా నేడు పార్టీ తీర్థం పుచ్చుకోబోతున్నారు. మరికొంతమంది ఎమ్మెల్యేలు కూడా పార్టీ మారేందుకు పావులు కలుపుతున్నారు.
బలం తగ్గిపోతున్న బీఆర్ఎస్, ఇలా అయితే కష్టమే
గత అసెంబ్లీ ఎన్నికల్లో 39 మంది ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ గెలుచుకున్నప్పటికీ, కంటోన్మెంట్ స్థానం ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఖాతాలో పడడం ఆ తర్వాత వరుసగా ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోవడంతో బిఆర్ఎస్ బలం తగ్గిపోయింది. ఇప్పటికే దానం నాగేందర్, కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాస్ రెడ్డి, కాలే యాదయ్య, డాక్టర్ సంజయ్, తెల్లం వెంకట్రావు, కృష్ణమోహన్ రెడ్డి తదితరులు కాంగ్రెస్లో చేరగా వలసల పర్వం కొనసాగేలా తాజా పరిస్థితి ఉంది.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications