హైదరాబాద్ లో భారీ అగ్ని ప్రమాదం - ఆరుగురు సజీవ దహనం..!!
హైదరాబాద్ లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఆరుగురు సజీవ దహనం అయ్యారు. నాంపల్లిలోని బజారఘాట్‌లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఓ రసాయనాల గోదాంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. నాలుగు అంతస్తుల వరకు వ్యాపించాయి మంటలు. మంటల్లో పలువురు కార్మికులు చిక్కుకున్నారు. ఆరుగురు మరణించినట్లు గుర్తించారు. పెద్ద సంఖ్యలో గాయాలు అయిన వారిని ఆస్పత్రులకు తరలించారు. రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది.. మూడు ఫైరింజిన్లతో మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు.
నాంపల్లిలోని బజారఘాట్‌లో భారీ అగ్నిప్రమాదంలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మంటల్లో ఇంకా కొంతమంది చిక్కుకున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా ప్రాంతానికి చేరుకున్నారు. రసాయన గిడ్డంగి ఉన్న అపార్టుమెంటులో 60 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. నాలుగు అంతస్తులకు మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో అపార్టుమెంటు ముందున్న కార్లు, ద్విచక్రవాహనాలు దగ్ధమయ్యాయి. పోలీసులు, జీహెచ్‌ఎంసీ అధికారులు హుటాహుటిన ఘటనా ప్రాంతానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

ప్రమాదంలో ఆరుగురు సజీవ దహనం..ఊపిరి ఆడక ఈ ఆరుగులు మరణించినట్లు గుర్తించిన అధికారులు..ప్రమాదంలో చిక్కుకున్న వారికి సాయం అందిస్తున్నారు. అపార్టుమెంట్ గ్రౌండ్ ఫ్లోర్‌లో ఓ గ్యారేజీ ఉన్నదని, ఆ గ్యారేజీలో కారును రిపేర్ చేస్తుండగా మంటలు చెలరేగాయని డీసీపీ తెలిపారు. గ్రౌండ్ ఫ్లోర్‌లోనే డీజిల్, కెమికల్ డ్రమ్ములు ఉండటంతో వాటికి మంటలు అంటుకుని భారీ ప్రమాదం జరిగిందని ఆయన చెప్పారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన నలుగురి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. మరణంచిన వారిలో నలుగురు పురుషులు, ఇద్దరు మహిళలు ఉన్నట్లు తెలుస్తోంది. 15 మంది సహాయక టీంలు రక్షించాయి.












Click it and Unblock the Notifications