తల్లి అక్రమ సంబంధం: దగ్గరుండి ప్రియుడితో కొడుకుని కొట్టించింది

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: తన వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడనే కోపంతో ఓ కారు డ్రైవర్ ఆరేళ్ల బాలుడిని చితకబాదాడు. అతను ఎలక్ట్రిక్ వైర్‌తో ఆ బాలుడిని బాదుతుంటే బాలుడి తల్లి ప్రియుడికి సహకరించింది. దగ్గరుండి ప్రియుడితో తన కుమారుడిని కొట్టించింది.

స్థానికులు స్పందించి దేహశుద్ధి చేసిన డ్రైవర్‌ను పోలీసులకు అప్పగించారు. ఈ సంఘటన హైదరాబాదులోని సనత్‌నగర్ పోలీసు స్టేషన్ పరిధిలోని మోతీనగర్ బబ్బుగుడాలో జరిగింది.

ఒకటో తరగతి చదువుతున్నాడు

ఒకటో తరగతి చదువుతున్నాడు

శ్రీకాకుళం జిల్లాకు చెందిన జయమ్మ తన భర్త మరణించడంతో ఉపాధి కోసం హైదరాబాదు వచ్చింది. మోతీనగర్ ప్రాంతంలోని బబ్బుగుడాలో నివాసం ఉంటూ ఇళ్లలో పనిచేస్తూ వస్తోంది. జయమ్మకు పవన్ కుమార్ అనే ఆరేళ్ల కుమారుడు ఉన్నాడు. ఇతను స్థానిక ప్రభుత్వ పాఠశాలలో ఒకటో తరగతి చదువుతున్నాడు.

కారు డ్రైవర్‌తో ఆమెకు సంబంధం

కారు డ్రైవర్‌తో ఆమెకు సంబంధం

జయమ్మకు స్థానికంగా ఉండే కారు డ్రైవర్‌ పెద్దిరాజుతో ఏడాది క్రితం పరిచయమైంది. ఆ తర్వాత సహజీవనం చేస్తూ వచ్చారు. కొడుకును వదిలించుకోవాలని పెద్దిరాజు జయమ్మతో పోరు పెడుతూ వచ్చాు. దానికి తోడు చిన్న చిన్న సాకులు చూపి అతన్ని కొడుతూ ఉండేవాడు.

ఆ రోజు ఇలా కొట్టాడు...

ఆ రోజు ఇలా కొట్టాడు...

అల్లరి చేస్తున్నాడనే సాకుతో సోమవారంనాడు ప్లాస్టిక్ వైర్ తీసుకుని పెద్దిరాజు బాలుడిని తీవ్రంగా కొట్టాడు. బాలుడి వీపు, చేతులు కాళ్లపై తీవ్రంగా కొట్టాడు. దీంతో వాతలు తేలాయి. బాధ భరించలేక బాలుడు కేకలు వేశాడు.

బాలుడి కేకలతో...

బాలుడి కేకలతో...

బాలుడి కేకలు విని స్థానికులు వచ్చారు. బస్తీ అధ్యక్షుడు వెంకటేశ్వర్ రావు సహకారంతో బస్తీవాసులు పెద్దిరాజుకు దేహశుద్ధి చేశారు. ఆ తర్వాత సనత్‌నగర్ పోలీసులకు అప్పగించారు. వెంకటేశ్వర రావు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A six- year-old boy was severely beaten up by his mother's lover with an electric cable at Sanathnagar in Hyderabad on Monday.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి