చాక్లెట్లు ఆశపెట్టి బాలికపై ఇద్దరి అత్యాచారం: సీరియస్
హైదరాబాద్: ఆరేళ్ల బాలికపై ఇద్దరు బాలురు అత్యాచారానికి పాల్పడిన సంఘటన తీవ్ర సంచలనం సృష్టించింది. బాలిక ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఆమె పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు చెబుతున్నారు. హైదరాబాదులోని సరూర్‌నగర్‌లో ఈ సంఘటన చోటు చేసుకుంది.
ఓ 15 ఏళ్ల బాలుడు, మరో 13 ఏళ్ల బాలుడు అమ్మాయికి చాక్లెట్లు ఆశపెట్టి తీసుకుని వెళ్లి అత్యాచారం చేశారు. ఈ విషయాన్ని భయం కారణంగా బాలిక తల్లిదండ్రులకు చెప్పలేదు. అయితే, విపరీతంగా రక్తస్రావం జరుగుతుండడంతో ఆస్పత్రికి తీసుకుని వెళ్లారు. వైద్యులు ఆమెపై అత్యాచారం జరిగిన విషయాన్ని గుర్తించారు.

పోలీసులు ఇద్దరు అబ్బాయిలను అరెస్టు చేసి కేసు నమోదు చేశారు. సంఘటన శుక్రవారంనాడు జరిగినప్పటికీ పోలీసులు బుధవారంనాడు కేసు నమోదు చేయడంతో అది వెలుగులోకి వచ్చింది. బాలిక ఒకటో తరగతి చదువుతోంది. తల్లిదండ్రులు పనికి వెళ్లడంతో బాలిక ఇంట్లో ఒంటరిగా ఉంది.
బాలురు వచ్చి చాక్లెట్లు ఆశ పెట్టారు. తెలిసి ఉండడంతో బాలిక వారి వెంట వెళ్లింది. టెర్రాస్ మీదికి తీసుకుని వెళ్లి బాలికపై వారు అత్యాచారం జరిపారు. ఒకరి తర్వాత ఒకరు అమ్మాయిపై అత్యాచారం చేశారు.












Click it and Unblock the Notifications