ఎస్ఎల్బీసీ రెస్క్యూ ఆపరేషన్ పూర్తి.. లభించని ఆరుగురు కార్మికుల ఆచూకీ!
శ్రీశైలం ఎడమ గట్టు కాలువ సొరంగం పైకప్పు కూలిన దుర్ఘటన జరిగి 58 రోజులైంది. గత 58 రోజులుగా సొరంగంలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది. ప్రమాదం జరిగిన రోజు టన్నెల్ లోపల ఎనిమిది మంది చిక్కుకోగా, రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించిన బృందాలు రెండు మృతదేహాలను వెలికి తీయగలిగాయి. మిగతా ఆరుగురి కోసం రెస్క్యూ ఆపరేషన్ నిరంతరంగా కొనసాగింది.
షిర్ జోన్లో తవ్వకాలు అసాధ్యం
58 రోజులపాటు తవ్వకాలు జరిపినప్పటికీ ఫలితం మాత్రం శూన్యంగా మారింది. 58 రోజుల పాటు సాగిన రెస్క్యూ ఆపరేషన్ లో ఆరుగురు కార్మికుల ఆచూకీ లభించలేదు. దీంతో రెస్క్యూ బృందాలు షిర్ జోన్లో తవ్వకాలు అసాధ్యమని చెబుతున్నాయి. దీనిపై టెక్నికల్ కమిటీ తర్వాత తుది నిర్ణయం తీసుకోనుంది. నోగో జోన్లో తవ్వకాలు తెలిపితే మృతదేహాలు దొరికే అవకాశం ఉందని వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

రెస్క్యూ ఆపరేషన్ లో 12 సంస్థల బృందాలు
ఎనిమిది రోజులుగా సుదీర్ఘంగా జరిగిన రెస్క్యూ ఆపరేషన్ లో కేవలం రెండు మృతదేహాలను వెలికి తీయగలిగారు. మార్చి 9వ తేదీన గురుప్రీత్ సింగ్ మృతదేహాన్ని కనుగొన్నారు. ఇక మార్చి 22వ తేదీన ప్రాజెక్టు ఇంజనీర్ మనోజ్ కుమార్ మృతదేహాన్ని బయటకు తీసుకు రాగలిగారు. మొత్తం దేశంలోనే నైపుణ్యం కలిగిన 12 సంస్థల బృందాలు ప్రయత్నం చేసిన ఫలితం మాత్రం రాలేదు.
ఇప్పటివరకు దొరకని మరో ఆరుగురి ఆచూకీ
హైడ్రా, సింగరేణి, ఎన్డిఆర్ఎఫ్, ఎస్ డి ఆర్ ఎఫ్, ర్యాట్ హోల్ మైనర్స్ ఇలా నిపుణులైన వారంతా రంగంలోకి దిగిన మరో ఆరుగురి ఆచూకీని ఇప్పటివరకు కనిపెట్టలేకపోయారు.
టన్నెల్ లోపల 281 మీటర్ల మేర పేరుకుపోయిన మట్టి, రాళ్లు, టన్నెల్ బోరింగ్ యంత్రం భాగాలను ఇప్పటికే బయటకు తరలించారు. ఇక టన్నెల్ లోపల 43 మీటర్లను డేంజర్ జోన్ గా గుర్తించి అక్కడకు ఎవరు వెళ్లకూడదని నిషేధ ప్రాంతంగా సూచించారు.
డేంజర్ జోన్ లో పనులు చెయ్యాలంటే మరింత సమయం
ఈ జోన్ కు సమీపంలోనే సహాయక చర్యలను నిర్వహించారు. అయితే డేంజర్ జోన్లో సహాయక చర్యలను నిర్వహించడం అంత ఈజీ కాదని రెస్క్యూ బృందాలు భావిస్తున్నాయి. ఈ జోన్ కు సమీపంలో భారీగా వస్తున్న నీళ్లను మోటార్లతో తోడుతున్నారు. అయితే ప్రస్తుతానికి రెస్క్యూ ఆపరేషన్ ముగిసినట్లేనని, డేంజర్ జోన్లో పనులు చేయాలంటే మరింత సమయం పట్టే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.
-
దేశవ్యాప్తంగా 'ఎనర్జీ లాక్ డౌన్'.. ప్రతి బుధవారం సెలవు.. కఠినమైన రూల్స్ అమల్లోకి..! -
వాస్తు ప్రకారం ఐశ్వర్యాన్ని తెచ్చేది మనీప్లాంట్ కాదు.. 'క్రాసులా' మొక్కను పెంచాలి -
కేసీఆర్ ఫోన్, పరుగులు పెట్టిన ఆఫీసర్లు. -
మరో 100 కోట్ల బొమ్మ.. హిట్ మీద హిట్ కొట్టడం నీకే సాధ్యం అన్న -
విద్యార్థులకు గుడ్ న్యూస్.. మరో 4 రోజులు స్కూళ్లకు సెలవులు..! -
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
రైతు భరోసా రెండు, మూడో విడత నిధుల జమ షెడ్యూల్ ఫిక్స్- ఎవరికి ఎప్పుడు..!! -
రామ్ చరణ్ "పెద్ది" కోసం ప్రభాస్ ఫేవరెట్ బ్యూటీ.. -
పదో తరగతి ఫలితాల విడుదల పై తాజా నిర్ణయం..!! -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్!












Click it and Unblock the Notifications