Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

SLBC టన్నెల్ ప్రమాదం.. రోబోలతో గాలిస్తున్నా.. తాజా పరిస్థితి ఇదే!

ఎస్ఎల్బీసీ టన్నెల్ పైకప్పు కూలిన ఘటనలో సొరంగంలో చిక్కుకుపోయిన వారి ఆచూకీ కోసం రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. నేటితో ఈ రెస్క్యూ ఆపరేషన్ కు 22వ రోజు. రోజులు గడుస్తున్నా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్నా ఇంకా సొరంగంలో చిక్కుకుపోయిన కార్మికుల జాడ పూర్తిగా తెలియలేదు.

టన్నెల్ లో కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్
21 రోజులుగా దేశంలోనే నిష్ణాతులైన వివిధ ఏజెన్సీ ల సహాయంతో సొరంగంలో కూరుకుపోయిన కార్మికుల కోసం వెతుకుతున్నారు. డిజాస్టర్ మేనేజ్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్ సొరంగంలోని పరిస్థితులపై ఎప్పటికప్పుడు సమావేశాలు నిర్వహించి సొరంగంలో జరుగుతున్న సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.

SLBC Tunnel accident This is the latest situation even though it is being handled by a robot

రెస్క్యూ ఆపరేషన్ కు మరో రెండు రోజులు పట్టే అవకాశం
ఇప్పటికే టన్నెల్లోకి పంపిన అటానమస్ హైడ్రాలిక్ పవర్డ్ రోబోకు అనుసంధానంగా 30 హెచ్పి సామర్థ్యం గల లిక్విడ్ రింగ్ వాక్యూమ్ ట్యాంక్ తో కూడిన యంత్రాన్ని సహాయక చర్యల కోసం శుక్రవారం సొరంగంలోకి పంపారు. ఎస్ ఎల్ బి సి టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్ మరో రెండు రోజులు పట్టే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం ఉపయోగిస్తున్న యంత్రాలు మట్టిని వేగంగా సమర్థవంతంగా తొలగిస్తాయని భావిస్తున్నారు.

మట్టిని తొలగించే పనిలో రెస్క్యూ బృందాలు
డి1, డి2 ల వద్ద ఇప్పటికే సింగరేణి హైడ్రా, ర్యాట్ హోల్ మైనర్స్, ఎన్ డి ఆర్ ఎఫ్ బృందాలు నాలుగు మీటర్ల లోతులో మట్టిని తొలగించే పనిలో నిమగ్నమయ్యారు. టన్నెల్ బోరింగ్ మిషన్ భాగాలను కట్ చేసి బయటకు తరలిస్తున్న క్రమంలో లోపల రెస్క్యూ ఆపరేషన్ కాస్త ఆలస్యంగా నడుస్తుంది. కార్మికులు తవ్విన మట్టిని ఎప్పటికప్పుడు పొక్లెయినర్ సహాయంతో బయటకు తెస్తున్నారు.

రెస్క్యూ ఆపరేషన్ మరో రెండు రోజులు పట్టే అవకాశం
ఇప్పటివరకు రెండు మృతదేహాలను బయటకు తీసుకురాగా, ఇంకా 6 మృతదేహాలను గుర్తించవలసి ఉంది. గత 22 రోజులుగా కేంద్ర, రాష్ట్ర రెస్క్యూ బృందాలు అవిశ్రాంతంగా శ్రమ చేస్తున్నప్పటికీ ఇంకా మృతదేహాలను బయటకు తెచ్చి కుటుంబ సభ్యులకి అందించలేకపోయారు. అయితే మరో రెండు రోజుల్లో మిగతా ఆరుగురు మృతదేహాలను కూడా వెలికి తీస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. మృతుల కుటుంబ సభ్యులు తమ వారి కోసం కన్నీరు మున్నీరుగా రోదిస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+