ఎంత బిజీగా ఉన్నా సరే వెళ్లి ఓటెయ్యండి: స్మితా సబర్వాల్!!
తెలంగాణ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఉదయం నుంచి ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి క్యూ కడుతున్నారు. అయితే ఈసారి ఇప్పటివరకు గతానికి భిన్నంగా చాలా తక్కువ పోలింగ్ పర్సంటేజ్ నమోదు కావడంతో ఓటర్లు అంతా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని అధికారులు, ప్రజాప్రతినిధులు విజ్ఞప్తి చేస్తున్నారు.
ఒకపక్క సినీ సెలబ్రిటీలు ఓటు హక్కును వినియోగించుకుని ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని చెబుతుంటే, మరొకపక్క ఓటు హక్కును వినియోగించుకోవాలని, ఇంకా సమయం తక్కువగా ఉంది కాబట్టి, ఖచ్చితంగా ఓటు వెయ్యని వాళ్లంతా వెళ్లి ఓటు వేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు ప్రజా ప్రతినిధులు, అధికారులు.

హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి ఎన్బి టి నగర్ లోని ప్రభుత్వ పాఠశాలలో ఓటేసి ఇంకా ఓటు వేయడానికి రెండు గంటల సమయమే ఉన్నందున త్వరగా వెళ్లి ఓటు హక్కు వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. అంతేకాదు ముఖ్యమంత్రి కార్యాలయ అధికారిణి సీనియర్ ఐఏఎస్ స్మితా సబర్వాల్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
No matter how busy .. get out and vote 🗳️
— Smita Sabharwal (@SmitaSabharwal) November 30, 2023
4 hours to go !!#TelanganaAssemblyElections #Hyderabad pic.twitter.com/tCszaMXkX1
ఎంత బిజీగా ఉన్నా సరే వెళ్లి ఓటెయ్యండి.. ఇంకా కొద్ది గంటలే మిగిలి ఉంది అంటూ స్మిత సబర్వాల్ ఎక్స్ ఖాతాలో పంచుకున్నారు.ఇక ఇప్పటికే అనేక నియోజకవర్గాలలో పోలింగ్ చాలా మందకొడిగా సాగినట్లుగా తెలుస్తుంది. నియోజకవర్గాలలో అతి తక్కువ పోలింగ్ శాతం నమోదు కావడంతో రాజకీయ పార్టీల నేతలు హడావిడి పడుతున్నారు. ఓటర్లను వెళ్లి ఓటు హక్కు వినియోగించుకోవాలని ప్రాధేయ పడుతున్నారు.
గ్రామాలతో పోల్చుకుంటే పట్టణాలలోనే ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఆసక్తి చూపడం లేదు. హైదరాబాద్, వరంగల్ వంటి నగరాలలో ఓటింగ్ చాలా మందకొడిగా సాగుతున్న పరిస్థితి, ఓటింగ్ పై ఓటరు నిరాసక్తత స్పష్టం చేస్తుంది. ముఖ్యంగా చదువుకున్న వారే ఓటు హక్కు వినియోగించుకోకపోవటం ప్రధానంగా కనిపిస్తుంది. ఈ క్రమంలోనే ఓటు వేస్తున్న ప్రతి ఒక్కరు ప్లీజ్ మీ ఓటు హక్కును వినియోగించుకోండి. ప్రజాస్వామ్యాన్ని కాపాడండి అంటూ విజ్ఞప్తి చేస్తున్నారు.












Click it and Unblock the Notifications