తెలంగాణాలో ఆ పరిస్థితి లేదు: ఆ వీడియోతో స్మితా సబర్వాల్ ఆసక్తికరపోస్ట్!!

తెలంగాణ సీఎంవో సెక్రెటరీ, ఐఏఎస్ అధికారి స్మితాసబర్వాల్ సోషల్ మీడియాలో ఆసక్తికర మైన పోస్ట్ పెట్టారు. మహారాష్ట్రలోని పరిస్థితులను, తెలంగాణలోని పరిస్థితులను పోల్చి ఆమె ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో తాగునీటి కోసం ప్రజలు ఇబ్బందులు పడుతున్న వీడియోను రీ ట్వీట్ చేసిన స్మితా సబర్వాల్ అక్కడి ప్రజలు తాగునీటి కష్టాలను కళ్లకు కట్టినట్లు చూపించి, తెలంగాణ రాష్ట్రంలోని పరిస్థితిని వివరించారు.

ఒకే దేశం.. విభిన్న జీవితాలు అంటూ పేర్కొన్న స్మితాసబర్వాల్ చాలా హృదయవిదారకమైన పరిస్థితిని చూపించి విధి ఎంత విచారకరమైనది అంటూ ట్వీట్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో అటువంటి పరిస్థితి లేదని, మిషన్ భగీరథ పథకం ద్వారా తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి ఇంటికి మంచినీటిని సరఫరా చేస్తున్నారని స్మితా సబర్వాల్ పేర్కొన్నారు. ముఖ్యంగా ఇంజనీరింగ్ ప్రకృతి విపత్తును మార్చగలదని ఆమె పేర్కొన్నారు.

smithasabharwal

దాదాపు కోటికి పైగా ఇళ్లకు తెలంగాణ ప్రభుత్వం స్వచ్ఛమైన తాగునీటిని అందిస్తుందని స్మితాసబర్వాల్ ట్విట్టర్లో వెల్లడించారు. గతంలో తెలంగాణ ప్రజలు కూడా తీవ్ర నీటి కష్టాలను ఎదుర్కొన్నారని, ప్రస్తుతం తెలంగాణలో ఏ గ్రామంలో నీటి కొరత లేదని స్మితాసబర్వాల్ చెప్పారు.స్మిత సబర్వాల్ పోస్ట్ చేసిన మీడియాలో మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో మహిళలు తీవ్రమైన ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నారు. వాళ్ళు తాళ్ళ సహాయంతో బావిలోకి దిగి మంచినీళ్ల కోసం ప్రాణాలను పణంగా పెడుతున్నారు.

ఆ వీడియో మహారాష్ట్రలోని ప్రజల తాగునీటి కష్టాలను కళ్లకు కట్టినట్లు చెబుతోంది. బ్రతకడానికి తాగునీరు అవసరం కాబట్టి ప్రాణాలకు తెగించి నీళ్ల కోసం తాళ్లు కట్టుకొని మరి బావిలోకి దిగాల్సి వస్తుందని అక్కడి ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఆ వీడియో పోస్ట్ చేసిన స్మితాసబర్వాల్ తెలంగాణాలో తాగునీటి కష్టాలు లేవన్నారు.

స్మితాసబర్వాల్ పోస్టుపై నెటిజన్లు పాజిటివ్ గా స్పందిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో మిషన్ భగీరథ తో ప్రజల నీటి కష్టాలు తీరాయి అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ సుపరిపాలన వల్లనే ఇది సాధ్యమైందని కొందరు చెబుతున్నారు. మహారాష్ట్రలో కూడా బీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇస్తే కచ్చితంగా మహారాష్ట్రలో నీటి కష్టాలను తీర్చడానికి ప్రయత్నం జరుగుతుందని పలువురు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+