Smita Sabharwal: పండుగ రోజు ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టిన స్మితా సబర్వాల్..
స్మితా సబర్వాల్.. రాష్ట్రంలో ఈమె పేరు తెలియని వారు ఉండరు. గత ప్రభుత్వం హయాంలో కీలక అధికారిక వ్యవహరించిన స్మితా.. ఇప్పుడు సోషల్ మీడియాలో బిజీగా మారారు. సబర్వాల్ కు ట్విట్టర్ లో భారీగా ఫాలోవర్స్ ఉన్నారు. 4 లక్షలకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. దీంతో ఆమె ఓ పోస్ట్ పెట్టినా భారీగా రీచ్ అవుతోంది. తాజా స్మితా సబర్వాల్ ఉగాది పర్వదినం పురస్కరించుకుని ఓ ఫొటో పోస్ట్ చేశారు. ఈ ఫొటోలో స్మితా సబర్వాల్ చీర ధరించారు.
చేతిలో ప్లేట్ లో ఉగాది పచ్చడి, మామిడి ఆకులు, పువ్వులు, గంట, ఉన్నాయి. ఈ ఫొటోతో పాటు శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపారు స్మితా సబర్వాల్. "అన్ని రుచులతో కూడిన జీవితాన్ని ఆస్వాదించాలనే చేదు-తీపి గుర్తుకు #ఉగాదిని ప్రేమించండి" అని ట్వీట్ చేశారు. ఏప్రిల్ 6 రోజు కూడా స్మితా సబర్వాల్ ఓ ఫొటో పోస్ట్ చేశారు. " మీ ప్రేమ & మద్దతు 4 సంవత్సరాలుగా ప్రియమైన అనుచరులందరికీ" ధన్యవాదలు తెలిపారు.

ఈ మధ్య ప్రతి పండక్కి స్మితా సబర్వాల్ శుభాకాంక్షలు చెబుతున్నారు. స్మితా సబర్వాల్ 2001 బ్యాచ్ కు చెందినవారు. ఆమె కరీంనగర్, మెదక్ కలెక్టర్ బాధ్యతలు నిర్వహించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం కీలక అధికారిగా వ్యవహరించారు.తెలంగాణ నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శిగా పని చేశారు. కాశేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో కీలక పాత్ర పోషించారి. కాళేశ్వరం ప్రాజెక్టు మూడేళ్లకే దెబ్బతిన్నది. నీటిని ఆపడానికి పనికి రాకుండా పోయింది.
బిల్కీనోస్ భాను దోషులు విడుదల సమయంలో స్మితా సబర్వాల్ సీరియస్ గా స్పందించారు. అయితే ఆడవారి జరుగుతున్న ప్రతి అంశంపై స్పందించాలని నెటిజన్లు కోరారు.
Got it all on my plate!
— Smita Sabharwal (@SmitaSabharwal) April 9, 2024
Love #Ugadi for the bitter-sweet reminder that life with all its flavors is to be savoured 😀
శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు 🍯🥭🍃 pic.twitter.com/Ps76jF6wC5












Click it and Unblock the Notifications