హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కాఫీ కన్నా తక్కువ ధరకే బీమా (ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఆర్ధికంగా వెనుకబడిన, ఎలాంటి ఆధారం లేదని సాధారణ ప్రజలకు బీమా, ఫించన్ సదుపాయాన్ని అందించే లక్ష్యంతో ప్రభుత్వం కొత్త పథకాలను అందుబాటులోకి తీసుకొచ్చినట్టు కేంద్ర వనరుల అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ తెలిపారు.

శనివారంనాడిక్కడ తెలంగాణ ఎస్‌ఎల్‌బిసి కన్వీనర్‌ ఎస్‌బిహెచ్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో స్మృతి ఇరానీ మాట్లాడారు. ప్రస్తుత రోజుల్లో కాఫీ తాగాలంటే కనీసం రూ. 20 అవుతుందని, ఎన్టీఏ ప్రభుత్వం కాఫీ కన్నా తక్కువ ధరకే బీమాను ప్రధానమంత్రి సురక్షా బీమా పథకం కింద అందిస్తోందని చెప్పారు.

స్మృతి ఇరానీని కలిసిన దర్శకుడు శంకర్

మహారాష్ట్రలోని పూణెలో ఉన్న మాదిరిగా తెలంగాణలోనూ కేంద్రప్రభుత్వ ఆధ్వర్యంలో ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌ను ఏర్పాటు చేయాలని ప్రమఖ దర్శకుడు శంకర్ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి విజ్ఞప్తి చేశారు. సామాజిక బీమా భద్రతా పథకాలను ప్రారంభించేందుకు నగరానికి వచ్చిన మంత్రిని ఆయన కలిశారు.

 కాఫీ కన్నా తక్కువ ధరకే బీమా: కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ

కాఫీ కన్నా తక్కువ ధరకే బీమా: కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ

ఆర్ధికంగా వెనుకబడిన, ఎలాంటి ఆధారం లేదని సాధారణ ప్రజలకు బీమా, ఫించన్ సదుపాయాన్ని అందించే లక్ష్యంతో ప్రభుత్వం కొత్త పథకాలను అందుబాటులోకి తీసుకొచ్చినట్టు కేంద్ర వనరుల అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ తెలిపారు.

కాఫీ కన్నా తక్కువ ధరకే బీమా: కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ

కాఫీ కన్నా తక్కువ ధరకే బీమా: కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ

దీంతో పాటు ప్రధాన మంత్రి జీవన్‌ జ్యోతి బీమా పథకం కింద ఏడాదికి 330 రూపాయలు చెల్లిస్తే పాలసీదారు ఏవిధంగా మృతి చెందినా 2 లక్షల రూపాయల బీమా పరిహారం అందుతుందన్నారు. ఏడాదిలో ఒకరోజు కుటుంబంతో కలిసి బయట భోంచేసిన దానికన్నా ఇది తక్కువని అన్నారు. డబ్బుల్లేని నిరుపేదలకు బ్యాంకు ఖాతా ఉండాలనే ఉద్దేశ్యంతో జీరో బ్యాలెన్స్‌తో ఖాతా తెరిచేలా కృషి చేసి ప్రధాని చరిత్ర సృష్టించారని పేర్కొన్నారు.

కాఫీ కన్నా తక్కువ ధరకే బీమా: కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ

కాఫీ కన్నా తక్కువ ధరకే బీమా: కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ

ఇక అటల్‌ పెన్షన్‌ యోజన కింద అవ్యవస్థీకృత రంగంలోని వారి (18 నుంచి 40 ఏళ్ల వయసు) నెలనెలా చందాను కడితే 60 ఏళ్ల తర్వాత పెన్షన్‌ పొందవచ్చన్నారు. కుటుంబంలో సంపాదించే వారు మరణించిన సందర్భంలో మిగతా సభ్యులు దిక్కులేని వారవుతున్నారని, దీన్ని దృష్టిలో ఉంచుకుని తమ ప్రభుత్వం ఈ పథకాలను అందుబాటులోకి తెచ్చిందన్నారు.

 కాఫీ కన్నా తక్కువ ధరకే బీమా: కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ

కాఫీ కన్నా తక్కువ ధరకే బీమా: కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ

ఈ కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్‌ మాట్లాడుతూ ప్రధాన మంత్రి జన్‌ధన్‌ యోజనా కింద 60 లక్షల ఖాతాలు తెరవాలని తమ రాష్ర్టానికి లక్ష్యం నిర్దేశిస్తే 63 లక్షల ఖాతాలను తెరిచామన్నారు. సామాన్య ప్రజలకు మేలు చేసేందుకు ప్రభుత్వాలు కొత్త ధోరణిలో ఆలోచిస్తున్నాయని, ఇందుకు బ్యాంకుల సహకారం అవసరం అన్నారు.

 కాఫీ కన్నా తక్కువ ధరకే బీమా: కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ

కాఫీ కన్నా తక్కువ ధరకే బీమా: కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ

ఇంకా బ్యాంకు ఖాతాలు తెరవని వారిని బ్యాంకు అధికారులు గుర్తించి వారికి ప్రభుత్వ పథకాలు చేరవయ్యేలా కృషి చేయాలన్నారు. కార్పొరేట్‌ కంపెనీలకు వేల కోట్ల రూపాయల అప్పులిచ్చి ఇబ్బందులు పడుతున్న బ్యాంకులు సాధారణ ప్రజలకు మేలు జరిగే విధంగా వ్యవహరించాలని ఆయన అన్నారు.

 కాఫీ కన్నా తక్కువ ధరకే బీమా: కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ

కాఫీ కన్నా తక్కువ ధరకే బీమా: కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ

ఎస్‌బిహెచ్‌ సిజిఎం వి విశ్వనాథన్‌ మాట్లాడుతూ ఇప్పటికే 13 లక్షల మంది ఖాతాదారులకు ఈ పథకాలను అందుబాటులోకి తెచ్చామన్నారు. రానున్న కాలంలో మరింత ఎక్కువ మంది ఈ పథకాలను పొందే విధంగా ప్రచారం చేస్తామని చెప్పారు.

English summary
Union HRD Minister Smriti Zubin Irani launched three Central schemes Pradhan Mantri Suraksh Bima Yojana, Atal Pension Yojana and Pradhan Mantri Jeevan Jyothi Bima Youjana here on Saturday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X