200మందితో చాటింగ్: తెలియని వ్యక్తులతో వద్దు, అమ్మాయి అనుకొని యాక్సెప్ట్ చేశా!
హైదరాబాద్: 200 మందితో చాటింగ్ చేస్తూ, పలువురిని.. నగ్న చిత్రాలు నెట్లో పెడతానని బెదిరించిన అబ్దుల్ మాజిద్‌ను శుక్రవారం పోలీసులు అరెస్టు చేశారు. అయితే, అతని నెంబర్ షేర్ చేయడమే కొంప ముంచిందంటున్నారు. ఈ ఘటన ద్వారా తెలియని వ్యక్తులతో ఫ్రెండ్ షిప్ వద్దని సూచిస్తున్నారు.
అబ్దుల్ మాజిద్ బారిన చాలామంది అమ్మాయిలు పడ్డారు. అయితే, వారంతా భయంతో ఫిర్యాదు చేసేందుకు వెనుకడుగు వేశారు. అయితే, ఓ విద్యార్థిని తన తల్లికి విషయం చెప్పింది. ఆ తల్లి ధైర్యంగా పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో విషయం వెలుగు చూసింది.
ఆ తల్లీ, అమ్మాయి మాట్లాడుతూ... ఇంటర్నెట్ ద్వారా తెలియని వ్యక్తులతో ప్రెండ్ షిప్ పట్ల జాగ్రత్తగా ఉండాలని, అలాంటివి వద్దని సూచించారు.
తన కూతురు తనకు మాజిద్ వేధింపుల విషయం చెప్పిందని, దీంతో తాము చాలా ఆందోళన చెందామని, ఆ తర్వాత ధైర్యం చేసి పోలీసులకు కాల్ చేశామన్నారు. తమకు కమిషనర్ సహకరించారని చెప్పారు. వెంటనే అతనిని ట్రాప్ చేసి పట్టుకున్నారన్నారు.
ఈ విషయమై తమకు మూడు రోజుల పాటు తిండి, నిద్ర లేక ఆందోళన చెందామన్నారు. బాగా భయపడ్డామని చెప్పారు. మానసిక వేధన చెప్పలేమన్నారు.

అమ్మాయి మాట్లాడుతూ... తనకు వచ్చిన ఫ్రెండ్ రిక్వెస్టులు 5 మాత్రమే అని చెప్పారు. మాజిద్ ప్రొఫైల్ చూసి అమ్మాయి అనుకోని యాక్సెప్ట్ చేశానని చెప్పారు.
ఆ తర్వాత తనకు మెసేజ్ పెట్టారని, నీకు సహకరించేందుకు ఓ విషయం చెబుతున్నానని, నీ పిక్చర్స్ ఒకరి వద్ద ఉన్నాయని, వాటిని తనకు పంపించాలని చెప్పాడని, అయితే, తాను అలాంటి పిక్చర్స్ ఎప్పుడు పంపించలేదని, అందుకే తాను ధైర్యంగా ఈ విషయాన్ని మా అమ్మకు చెప్పానన్నారు. ఆ తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. సంఘటన రోజు తాము ఎంతో మానసిక వేదన అనుభవించామన్నారు.
ఈ సంఘటన ఇంత పెద్ద అంశం అవుతుందని తాను భావించలేదని బాధిత అమ్మాయి చెప్పారు. అన్ నోన్ (తెలియని వారు) నెట్లో రిక్వెస్ట్ చేస్తే ఏం తెలుసుకోకుండా యాక్సెప్ట్ చేయడం మంచిది కాదని చెప్పారు. తనకు తన కుటుంబం మంచి మద్దతు ఇచ్చిందన్నారు.












Click it and Unblock the Notifications