డ్రైవర్ తొందరపాటు, టెక్కీ చెవిలో ఇయర్ ఫోన్స్: బస్సు చక్రం కిందపడి టెక్కీ శిరీష మృతి
బంజారాహిల్స్ రోడ్డు ప్రమాదంలో ఓ మహిళా టెక్కీ బుధవారం దుర్మరణం చెందిన విషయం తెలిసిందే. బస్సు డ్రైవర్ చేసిన తప్పుకు ఆమె జీవితం అర్ధాంతరంగా ముగిసిపోయింది.
హైదరాబాద్: బంజారాహిల్స్ రోడ్డు ప్రమాదంలో ఓ మహిళా టెక్కీ బుధవారం దుర్మరణం చెందిన విషయం తెలిసిందే. బస్సు డ్రైవర్ చేసిన తప్పుకు ఆమె జీవితం అర్ధాంతరంగా ముగిసిపోయింది.
Recommended Video


స్పిన్ఎస్సీఐలో పని చేస్తున్న శిరీష
గాజుల రామారానికి చెందిన ఇరవై అయిదేళ్ల శిరీష బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ 12లోని స్పిన్‌ఎస్‌సీఐ సాఫ్ట్‌వేర్ సంస్థలో ఉద్యోగం చేస్తున్నారు. బుధవారం మధ్యాహ్నం ఆర్టీసీ బస్సులో వచ్చారు. బంజారాహిల్స్ పెన్షన్ ఆఫీస్ చౌరస్తా దిగారు. రోడ్డు దాటుతుండగా మియాపూర్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఢీకొంది.

అక్కడికి అక్కడే ప్రాణాలు కోల్పోయారు
అక్కడే ఆమె ప్రాణాలు కోల్పోయారు. మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన డ్రైవర్ బాబును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.ఎస్సై దయాకర్ రెడ్డి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

డ్రైవర్ తొందరపాటు వల్లే
ఆర్టీసీ డ్రైవర్ తొందరపాటు వల్ల ఆమె మృతి చెందినట్లుగా చెబుతున్నారు. రోడ్డు సిగ్నల్స్‌ను పట్టించుకోకుండా బస్సును నిర్లక్ష్యంగా నడిపారని చెబుతున్నారు. దానికి తోడు టెక్కీ శిరీష తన చెవిలో ఇయర్ ఫోన్స్ పెట్టుకున్నారు. దీంతో ఆమె బస్సు రాకను గమనించలేదు. బస్సు వేగంగా వచ్చి బలంగా ఢీకొట్టింది.

బస్సు చక్రం వెళ్లడంతో
కిందపడిన ఆమె పై నుంచి బస్సు ముందు చక్రం వెళ్లడంతో అక్కడికి అక్కడే మృతి చెందారు. మృతి చెందిన శిరీష నాలుగు నెలల గర్భిణీ.

భద్రాద్రి కొత్తగూడెంకు చెందిన మహిళ
శిరీష భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెంకు చెందిన వారు. ఆమె భర్త మురళీకృష్ణతో కలిసి గాజులరామారంలో నివసిస్తున్నారు. డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ఆమె మృతి చెందారని స్థానికంగా ఉన్న వారు కూడా చెప్పారు.
-
ఈ జిల్లాలకు వర్ష సూచన చేసిన ద్రోణి.. రైతన్నలూ అలెర్ట్! -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
దేవాన్ష్ పేరిట తిరుమలలో ఆ రోజు ఖర్చు మొత్తం చంద్రబాబుదే, స్వయంగా..!! -
సీఎం తొలి సంతకం.. పేదల కోసం వరాల ఉగాది! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
Dhurandhar 2 Review:"భాయ్" తేల్చేశాడు భయ్యా...బన్నీ ఫ్యాన్స్ గెట్ రెడీ..!! -
Today Rasi Phalalu March 19th: ఉగాది రోజున ఎవరికి యోగం?ఎవరికి హెచ్చరిక?మీ రాశి ఫలం ఇక్కడే!












Click it and Unblock the Notifications