'అర్జెంట్.. ఒక్క కాల్ ప్లీజ్!': అర్థరాత్రి 1.30కి, టెక్కీకి బిగ్ షాక్..

Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: గుర్తు తెలియని వ్యక్తులు ఓ టెక్కీపై దాడి చేసి అతని బ్రాస్ లెట్, బంగారు గొలుసు, స్మార్ట్ ఫోన్ చోరీ చేసిన ఘటన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో చోటు చేసుకుంది.

ట్రీట్‌మెంట్ కోసం వస్తారు.. అందాల వల విసురుతారు, చిక్కుకున్నారో ఇంతేసంగతులు!

బాధితుడు విధులు ముగించుకుని అర్థరాత్రి దాటిన తర్వాత కంపెనీ నుంచి బయటకొచ్చాడు. ఆ తర్వాత మీల్స్ పార్శిల్ నిమిత్తం హోటల్ కోసం వెతుకున్న సమయంలో.. అగంతకులు అడ్డుపడి చోరీ చేశారు.

పోలీసుల కథనం ప్రకారం:

పోలీసుల కథనం ప్రకారం:

సౌత్‌ లాలాగూడకు చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ సంతోష్‌కుమార్‌ బుధవారం అర్థరాత్రి దాటిన తర్వాత విధులు ముగించుకుని బయటకొచ్చాడు. తెల్లవారు జామున 1.30 సమయంలో ఇంటికి బయలుదేరి.. మధ్యలో మీల్స్ పార్శిల్ తీసుకునేందుకు హోటల్ కోసం గాలించాడు.

 హోటల్ కోసం వెతుకుతుండగా:

హోటల్ కోసం వెతుకుతుండగా:

ఈ క్రమంలో బంజారాహిల్స్‌ రోడ్‌ నెం. 2లోని ఇందిరానగర్‌కు వెళ్లగా.. హోటల్ సుఖ్ సాగర్ మూసి ఉ:ది. దీంతో సమీపంలోని మరో హోటల్‌కు వెళ్లేందుకు బైకు స్టార్ట్‌ చేశాడు. ఇంతలోనే ఇద్దరు అగంతకులు అక్కడికి వచ్చి.. 'అర్జెంటుగా ఫోన్‌ కాల్‌ చేసుకోవాలి, మొబైల్‌ ఇస్తారా?' అని అడిగారు.

 బంగారం.. మొబైల్ చోరీ:

బంగారం.. మొబైల్ చోరీ:

మొబైల్ ఇవ్వాలా?.. వద్దా? అని ఆలోచిస్తుండగానే.. బైక్ పై వెనుక కూర్చున్న వ్యక్తి సంతోష్ చేతిలోని మొబైల్ లాక్కున్నాడు. దాంతో పాటు చేతికి ఉన్న బ్రాస్ లెట్ తో పాటు మెడలోని బంగారు గొలుసులు లాక్కున్నాడు.

 నంబర్ ప్లేట్ లేని బైక్:

నంబర్ ప్లేట్ లేని బైక్:

సంతోష్ అడ్డుకునేందుకు ప్రయత్నించగా.. మెడ పట్టి తోసేయడంతో కింద పడ్డాడు. దుండగులు నంబర్ ప్లేట్ లేని బైక్ పై హెల్మెట్ ధరించి రావడంతో వారిని గుర్తుపట్టడం కష్టంగా మారింది. దీనిపై సంతోష్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Santosh, A software engineer was looted by two unidentified persons at late night in Hyderabad.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి