అమ్మాయి కోసం 2గ్రూపుల ఫైట్: బంజారాహిల్స్ రోడ్ల వెంట ఛేజింగులు, అరెస్ట్
హైదరాబాద్: ఓ అమ్మాయి కోసం రెండు గ్రూపుల విద్యార్థులు కొట్టుకోవడంతో ఉద్రిక్తతకు దారితీసింది. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి ఇరువర్గాలను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తార్నాకకు చెందిన అనురాగ్ అనే విద్యార్థి బంజారాహిల్స్ రోడ్ నెం. 11లోని అమిటీ ఎంబీఏ కాలేజీలో బీబీఏ చదువుతున్నాడు. ఇదే కళాశాలలో చదువుతున్న విద్యార్థినిని
హైదరాబాద్: అమ్మాయి కోసం విద్యార్థుల మధ్య జరిగిన గొడవ ఉద్రిక్తతకు దారి తీసింది. బంజారాహిల్స్ పోలీసుల కథనం ప్రకారం... తార్నాకకు చెందిన అనురాగ్ అనే విద్యార్థి బంజారాహిల్స్ రోడ్ నెం. 11 లోని అమిటి ఎంబీఏ కళాశాలలో బీబీఏ చదువుతున్నాడు.

కాగా, ఇదే కళాశాలలో చదువుతున్న విద్యార్థినిని ప్రతి రోజూ మాసబ్ ట్యాంక్‌కు చెందిన మన్సూర్ అలీఖాన్ అనే యువకుడు తన బైక్‌పై తీసుకుపోతున్నాడు. అయితే, తమ కాలేజీకి చెందిన విద్యార్థినిని అలా తీసుకెళ్లడం పద్ధతి కాదంటూ అనురాగ్ రెండు రోజుల క్రితం మన్సూర్ అలీఖాన్‌ను హెచ్చరించాడు.
దీంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఈ నేపథ్యంలో మంగళవారం సాయంత్రం అనురాగ్ స్నేహితులు యువతిని తీసుకుపోవడం వచ్చిన మన్సూర్ అలీఖాన్‌పై దాడి చేశారు. ఇందుకు ప్రతీకారంగా మన్సూర్ తన స్నేహితులు 20మందిని తీసుకుని బుధవారం సాయంత్రం కళాశాల వద్దకు చేరుకున్నాడు.
ఇరువర్గాలు ఒకరిపై ఒకరు దాడి చేసుకుంటూ.. వెంబడించుకుంటూ రోడ్ నెం. 8కి చేరుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు.. విద్యార్థులందరినీ అదుపులోకి తీసుకున్నారు. రెండు గ్రూపులు ఇచ్చిన ఫిర్యాదుల మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications